నెల: నవంబర్ 2011
-
ఇంతేనా… ఏన్ బ్రాంటి (Anne Bronte)
. ఓ దైవమా! జీవితం నాకు చూపగలిగింది ఇంతే అయినపుడు, వేదనాభరితమైన నా నుదిటిని, సేదదీర్చే నీ చల్లని చెయ్యి తాకనపుడు . ఇంతకంటే కాంతివంతంగా ఈ ఆశాదీపము జ్వలించలేనపుడు నేను బ్రహ్మానందాన్ని కేవలం కలగంటూ, శోకమయ జీవితంలోకి కళ్ళు తెరవవలసివచ్చినప్పుడు . అన్ని సుఖాలూ సెలవుతీసుకున్నాక, సాంత్వననిచ్చే స్నేహంకూడా కనుమరుగవుతున్నప్పుడు నేను ప్రేమకై తిరుగాడుతుంటే ఎప్పుడూ అది అందనంతదూరంలోనే ఉన్నప్పుడు . ఇతరుల ఆదేశాలకు బానిసలా బ్రతుకుతూ, తిరిగే తిరుగుడుకీ, పడే పాటుకీ ఫలితం…
-
చెట్లు … జాయిస్ కిల్మర్
. చెట్టుకంటే అందమైన కవిత ఎక్కడైనా ఉంటుందని నేననుకోను . పుడమితల్లి వెల్లువల స్తన్యానికి ఆకొన్న నోటిని ఆబగా అదిమే …చెట్టు . ప్రతిరోజూ దేవుని దర్శిస్తూ, తన పత్రహస్తాలను మోడ్చి ప్రార్థించే … చెట్టు . మండు వేసవిలో చెండులా తనతలలో గొరవంక గూళ్లను ధరించే… చెట్టు . గుండెలపై మంచు గువ్వలా వాలే … చెట్టు వర్షధారలలో మమేకమైన … చెట్టు . కవితకేముంది… నాలాంటి మూర్ఖుడెవడైనా రాయగలడు, కానీ, చెట్టుని మాత్రం ఒక్క…
-
నీ ముక్కు ముఖమ్మీదే ఉన్నందుకు సంతోషించు… జాక్ ప్రెలుస్కీ
. నీ ముక్కు నీ ముఖం మీద ఉన్నందుకు సంతోషించు, ఇంకెక్కడో అతకబడకుండా. ఎందుకంటే, అది ఉన్నచోట కాకుండా ఇంకోచోట ఉండి ఉంటే, నీ ముక్కుని నువ్వే చాలా అసహ్యించుకోవచ్చు . మాటవరసకి, నీ కుదురైన ముక్కు కాలివేళ్ల మధ్య ఉందనుకుందాం. ఖచ్చితంగా అది చూడ్డానికి అస్సలు బాగుండదు. మీదుమిక్కిలి, నీ కాళ్ళు నువ్వు వాసనచూడాల్సి వస్తుంది . అదే నెత్తిమీద అతికించి ఉందనుకుందాం. అప్పుడది చూడ్డానికి మహాభయంకరంగా ఉంటుంది. నీ వెంట్రుకలు నిత్యం దాన్ని గిలిగింతలుపెడుతుంటే,…
-
రెక్కతొడిగిన ఆశ … ఎమిలీ డికిన్సన్
. ఆశ ఒక రెక్కతొడిగిన పిట్ట… అది మనసు చివురులమీద వాలి నిర్విరామంగా రాగం తీస్తూనే ఉంటుంది పదాల్లేని పదం ఏదో. . మలయమారుతంలో అది మరీ కమ్మగా వినిపిస్తుంది తుఫాను ఎంతభీకరంగా ఉన్నా, ఎంతోమందిని నులివెచ్చగా ఉంచగలిగినందుకు ఆ చిన్ని పిట్ట సిగ్గులుపోతుంది . ఆ రాగం అత్యంత శీతల ప్రదేశాల్లో విన్నాను వినూత్న సాగరాలమీద విన్నాను కానీ, ఎంత విషమ పరిస్థితుల్లోనూ నా ‘కిది’ కావాలని అది నన్నెన్నడూ కోరలేదు. . ఎమిలీ…
-
సమాధి మృత్తికలు … జాన్ మెక్రీ, కెనెడియన్ కవి
. సమాధి మృత్తికలపై వరుస మీద వరుస కావిరంగు సుమాలు పూస్తున్నై మా ఉనికి తెలపడానికి; పైన ఆకాశంలో భరతపక్షులు పాడుకుంటూ ఎగురుతున్నాయి క్రింది తుపాకుల గౌరవవందనంలో వినిపించకపోయినా . మేమిపుడు విగతజీవులం. అయితేనేం? మొన్నటివరకూ బ్రతుకు రుచి ఎరిగినవాళ్ళం; సూర్యోదయం చూసేం, అస్తమయసంధ్య కని పరవశించేం; ప్రేమించి, ప్రేమింపబడిన వాళ్లం. ఇప్పుడీ అశ్రాంతవిడుదులలో విశ్రాంతితీసుకుంటున్నాం . శతృవుపై పోరాటాన్ని కొనసాగించండి. మా వాలుతున్నచేతులతో అందిస్తున్న దివిటీలను అందుకోండి; వాటిని నిలబెట్టే పూచీ ఇక మీదే; మాటతప్పేరో, మేము…
-
బతుకు పాట … లాంగ్ ఫెలో
. నాకు చెప్పకు, నీ శోకగీతికలతో, జీవితమొక శూన్యపు కల అని! చైతన్యవంతం కాని ఆత్మ, మృతిచెందినట్టే లెఖ్ఖ. యదార్థానికి, వస్తువులు కనిపించినతీరులో ఉండవు. . జీవితం సత్యం. జీవితం వాస్తవం! గోరీ కాదు దాని గమ్యం మట్టిలోంచి పుట్టినది మట్టిలో కలిసిపోతుందన్నది ఆత్మకు వర్తించదు. . సుఖభోగమో, విషాదమో మన మార్గమూ, విధిలిఖిత చరమావధీ కావు. ప్రతి ఉదయమూ, మనం నిన్నటికంటె ముందు ఉండేలా అడుగెయ్యడమే! . కళ చూస్తే అనంతం… కాలమా! పరిగెడుతోంది, మన…
-
మనిషొక దీవి కాదు … జాన్ డన్
. మనిషి ఒక స్వయం సమృధ్ధమైన దీవి కాదు… ప్రతివాడూ ఒక భూఖండంలో ఖండమే… సంపూర్ణతకి పరిపూర్ణతనిచ్చే అంతర్భాగమే… ఒక మట్టిపెళ్ళ కెరటాలకి కొట్టుకుపోయినా, యూరోపు ఆ మేరకు వెలవెలబోతుంది ఒక మిట్ట తరిగిపోయినరీతి… నీదో, నీ స్నేహితుడిదో, మొఖాసాలో కొంత భూమి కోల్పోయినతీరు… మరణించిన ప్రతి మనిషితోనూ, నాలో కొంత మేరను కోల్పోతున్నాను నేను, ఎందుకంటే నేను మనుషులతో ముడిపడి ఉన్నాను గనుక. అందుకే, గంటలు ఎవరికోసం మ్రోగుతున్నాయో తెలుసుకుందికి కబురంపకు… అవి నీ కోసమే…
-
ఈ క్షణం … లార్డ్ బైరన్
. మావి గుబురులలోనుండి కోయిల పంచమస్వరాలు వినిపించేది ఈ క్షణమే … ప్రేమికుల రహస్యవాగ్దానాలలోని ప్రతి మాటా మధురంగా వినిపించేది ఈ వేళలోనే … సమీపంలోని ప్రతి తెమ్మెరా, ప్రతి అలా ఏకాంతంలో వీనులకు సంగీతపు విందు చేసేదీ ఈ సమయమే… తుహినబిందువులు పువ్వులపై లలిత లలితంగా రాలేదీ, ఆకసాన తారకలు కలిసేదీ, కెరటపుటంచున తొలి నీలి మెరుగు మెరిసేదీ, ముదురాకున కావిరంగు కవిసేదీ ఈ క్షణమే… సాయం సంధ్యననుసరించిన చీకటి, గహన గగనాంతరాన వ్యాపించిన మెత్తని…