నే నెందుకు బానిసనయ్యాను? … ఏన్ హాక్ షా

http://calstate.fullerton.edu/multimedia/2011sp/images/slave-chains-300.jpg
Image Courtesy: http://calstate.fullerton.edu

.

————————————————————————————–

ఒక పేద నిర్భాగ్యుడు  నిరంతరం “నేనెందుకు బానిసనయ్యాను?” అని తపిస్తూ గుండెకోతతో ఈ “ఐల్ ఆఫ్ ఫ్రాన్స్**” లో మరణించాడు.

………………  తమ “ప్రపంచ యాత్ర” పుస్తకంలో బెన్నెట్ & తైయెర్మన్.  

 ** ఇప్పుడు అది మారిషస్ గా పిలవబడుతోంది…. అనువాదకుడు.

————————————————————————————

నాకెందుకీ శాపగ్రస్తమైన పేరు? ఎందుకు? ఎందుకు నేను బానిసనయ్యాను?

మరణించేదాకా, ఈ నికృష్టపు జీవితం ఈడవమని ఎవరిచ్చారీ ఆదేశం?

మహానగాల ఏకాంతంలో, సింహంలా  స్వేఛ్ఛగా జన్మించిన నాకు,

కాళ్ళూచేతులకు సంకెలలు వేసి  బానిసనుచేసే హక్కు ఎవరిచ్చారు?

.

అటు చూసా… చక్కని నీటిచెలమల మధ్య, తలలూపే తరుసమూహాల మధ్య,

నిర్మలమైన నీరూ, పచ్చని పొదరిండ్లూ, పూలతీవెలమధ్య,

ఒక అపురూప లావణ్య స్పర్శతో, నిరాశకు తావులేకుండా నిలబడిఉంది తెల్లవాడి ఇల్లు.

నేను వెనుదిరిగాను. నాకు తెలుసు అక్కడ హృదయాలు ఆనందమయమై ఉంటాయని.

.

నాకు తెలుసు అక్కడ ఆనందమయమైన హృదయాలుంటాయని… ఎందుకంటే,

సంతోషాతిశయపు గొంతుకల ఆనందాన్ని తెమ్మెరలు మోసుకొస్తున్నాయి,

ఆ ధోరణి తెలుపుతోంది అవి స్వేఛ్ఛాజీవులవని;

బానిసగొంతులోతుల్లోంచి వచ్చే … వినీ వినిపడక నెమ్మదిగా  గొణుక్కునే స్వరంలా,

దురవస్థతో వణికేపెదాలనుండి తీగసాగే మాటల్లా, సమాధిలోంచి వినిపించే గొంతుకలా… లేవు.

.

వెనుతిరిగి చూసాను… అక్కడ ఒంటరిగా నిలబడి ఉంది నా గుడిశ. అది నా ఇల్లని పిలవలేను!

ఎందుకంటే, అక్కడ ప్రియమైన ముఖం గాని, పరిచయమున్న ఆకారం గాని,

ఏకాంతాన్ని పారద్రోలగల గొంతుగాని, బాధోపశమనము చెయ్యగల హస్తంగాని లేవు.

అలాంటివాడిదగ్గర నిరంతరం శ్రవించే కన్నీళ్ళుగాక, అంతకంటె గొప్పవేం పుట్టుకురాగలవు.

.

అతని త్రోవలో గులాబీలెందుకు పరుచుకుని ఉండాలి? నాత్రోవలో ఏల ముళ్ళు?

తెల్లవాడెందుకు నవ్వడానికే పుట్టాలి, నేను ఎందుకు  నిట్టూర్చడానికీ, ఏడవడానికీ? 

కారణం నాకు తెలియదు.  కాని, ఇదిమాత్రం తెలుసు… 

మరణించేదాకా నాకు ఆశ లేదు… సుఖం లేదు… నేను బానిసని! బానిసని!!!

.

ఏన్ హాక్ షా

బ్రిటిషు కవయిత్రి. 

ఆమె సర్ జాన్ హాక్ షా భార్య అనీ, ఆమె 3 కవితా సంకలనాలు వెలువరించిందనీ మినహాయిస్తే ఆమె గురించి ఏమీతెలియదు.  సామ్యూల్ బాంఫోర్డ్ అన్న శ్రామికవర్గ కవి  కవితా సంకలనాల్లో ఒక దాంట్లో ఆమె ప్రస్తావన ఉంది.

.

—————————————————————————————————————————————–
One poor wretch died here (Isle of France*) broken-hearted, constantly exclaiming, ‘why am I slave?’
————–Bennet and Tyerman’s Voyage Round the World.
  (*now it is known as Mauritius…translator)
—————————————————————————————————————————————-
                                        ***
Why do I bear that cursed name? Why. why am I a slave?
Why doomed to drag a wretched life, in sorrow to the grave?
Born ‘mid the mountain solitudes, And as the lion free,
Who had a right to bind these limbs and make a slave of me?
.
I looked–there stood the white man’s home, ‘mid pleasant founts and flowers
‘Mid waving woods and waters clear, green wines and rosy bowers;
It had an air of loveliness, that suited not despair—–
I turned away, for well I knew that happy hearts were there.
.
I knew that happy hearts were there, for voices full of glee
Came on the air, and from their tone I knew that they were free;
Unlike the low faint murmuring sound, that marks the wretched slave,
Words wrung from misery’s quivering lips, that sound as from the grave.
.
I turned—- there stood my lonely hut, I call it not my home,
For no beloved face is there, and no familiar form,
No voice to break its solitude, and none to soothe the woe
Of him who was but born so high, whose tears must ever flow.
.
Why does the rose bestrew his path, and mine the pricking thorn?
Why was the white man born to smile. and I to sigh and mourn?
I know not, only this I know, till in the silent grave
There is no hope, no joy for me, I am a slave—- a slave!

.

(1842)

ANN HAWKSHAW

A British poet.

Very little is known about her life except that she was the wife of  Sir John Hawkshaw , a railway engineer and that she published  3 volumes of poetry  Dionysius the Areopagite, with Other Poemsin 1842,  Poems for my Children  in 1847 and Sonnets on Anglo-Saxon History  in 1854. A mention was made of her  by Samuel Bamford, a Manchester working-class Poet and a radical in one of the Prefaces to his poems  in 1843.

“నే నెందుకు బానిసనయ్యాను? … ఏన్ హాక్ షా” కి 2 స్పందనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: