తొలి ప్రేమ … జాన్ క్లేర్

http://www.google.co.in/imgres?q=waheeda+rehman&hl=en&gbv=2&biw=960&bih=427&tbm=isch&tbnid=ZqDTDZ6wGygxNM:&imgrefurl=http://memsaabstory.wordpress.com/tag/waheeda-rehman/&docid=DmL3Sc47_tDIwM&imgurl=http://memsaabstory.files.wordpress.com/2009/07/solvasaal.jpg&w=450&h=343&ei=39zLTunVF4PRrQfrq73ZAw&zoom=1
Image Courtesy: http://www.google.co.in

.

ఆ క్షణం వరకు ప్రేమ నన్నెప్పుడూ

అంత అకస్మాత్తుగా, అంత తియ్యగా, తాకలేదు. 

ఆమె ముఖం ఒక మనోజ్ఞమైన కుసుమంలా వికసించి

నా మనసు పూర్తిగా దోచుకుంది.

.

నా ముఖం రక్తపుబొట్టులేనంతగా పాలిపోయింది

నా కాళ్ళు కదలాడడం మానేసేయి.

ఆమె నన్ను చూడగానే నాకేమయిందో!

నా జీవితం, సమస్తం మృత్పిండంలా మారిపోయాయి.

.

నా ముఖం లోకి ఒక్కసారి రక్తం పెల్లుబికింది.

నా కళ్ళు చూపులు దక్కి,

మిట్టమధ్యాహ్నం అర్థరాత్రిలా

చెట్లూ చేమలూ ఏవీ కనపడడం మానేసేయి.

.

కంటికి ఒక్కటి కనిపిస్తే ఒట్టు.

నా కళ్ళనుండి మాటలు ప్రవహించడం ప్రారంభించేయి,

తీగనుండి సాగే స్వరంలా,

నా గుండె ఉడుకురక్తంలో బొబ్బలెక్కుతోంది.

.

పుష్పాలు హేమంతపు సొత్తా?

ప్రేమకెప్పుడూ చలి’మంట’లేనా?

ఆమె నా మూగ బాసలు వింటున్నట్టుందిగాని,

ప్రేమమొర నర్థంచేసుకునే ప్రయత్నం లేదు.

.

నా ఎదురుగా ఉన్నంత చక్కని ముఖం 

నే  నిదివరకెన్నడూ చూడలేదు.

నా హృదయం తన ఉనికి విడిచి

మరి వెనకకి మరలి రాదే!

.

జాన్ క్లేర్

బ్రిటిషు కవి

.

First Love

.

I ne’er was struck before that hour
With love so sudden and so sweet,
Her face it bloomed like a sweet flower
And stole my heart away complete.
My face turned pale as deadly pale.
My legs refused to walk away,
And when she looked, what could I ail?
My life and all seemed turned to clay.

And then my blood rushed to my face
And took my eyesight quite away,
The trees and bushes round the place
Seemed midnight at noonday.
I could not see a single thing,
Words from my eyes did start —
They spoke as chords do from the string,
And blood burnt round my heart.

Are flowers the winter’s choice?
Is love’s bed always snow?
She seemed to hear my silent voice,
Not love’s appeals to know.
I never saw so sweet a face
As that I stood before.
My heart has left its dwelling-place
And can return no more

.

John Clare

“తొలి ప్రేమ … జాన్ క్లేర్” కి 3 స్పందనలు

  1. సున్నితమైన భావ ప్రకటన.

    మెచ్చుకోండి

    1. జ్యోతిర్మయిగారూ,
      కొందరి జీవితాలు చిత్రంగా బాధలననుభవించడానికే అన్నట్టుంటాయి. నిరుపేద రైతుకూలీ కుటుంబంలో పుట్టడం వలన పెద్దగా చదువుకునే అవకాశాలులేక అరకొరగా చదువుకున్నా, తల్లిదండ్రులు ఇల్లుఖాళీ చెయ్యవలసిన సందర్భం వస్తే దాన్ని నివారించడానికి చిన్నతనంలోనే గ్రామీణ జీవితం మీద చక్కని కవిత్వం వ్రాసి, సమకాలీనుల్లో వర్డ్స్ వర్త్ తో సమానమైన ప్రతిభ కలవాడిగా గుర్తించబడినా, వివక్షకు గురై, అంతటి కీర్తి, సంపాదనలు గడించలేక, పిల్లలను పోషించడానికి నానా తంటాలు పడుతూ, చివరికి పిచ్చాసుపత్రి పాలై, 20 సంవత్సరాలు పైగా జీవితాన్ని అక్కడే గడిపి తనువు చాలించిన ప్రతిభావంతుడైన ఇంగ్లీషు కవి జాన్ క్లేర్. పిచ్చాసుపత్రిలో ఉన్నప్పుడే, ఈ బ్లాగులో ఇంతకు ముందు అనువాదం చేసిన I Am అన్న కవిత వ్రాసేడు. అతనికి శాశ్వతమైన కీర్తి తెచ్చిపెట్టిన కవితలలో అదొకటి. అవకాశం ఉంటే చదవండి.
      అభివాదములతో,
      మూర్తి.

      మెచ్చుకోండి

  2. మూర్తి గారూ, ‘ఐ యాం’ కవిత చదివాను. మంచి కవితను పరిచయం చేశారు. జాన్ క్లేర్ గురించి చదివినప్పుడు చాల బాధగా అనిపించింది, మట్టిలో మాణిక్యం. ధన్యవాదములు.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: