Rain… K. Godavari Sarma Image Courtesy: http://1.bp.blogspot.com . Like a childhood friend Seen after long years of separation… A drizzle Raining delicately Like a shower of jasmine petals Embraced me with all its hands . Unable to realize a wee-bit How good a friend he was People ran for cover towards dry shelters To protect their heads from getting wet . Just me and the rain! Nobody else was there on the roads. Since it was an uninterrupted togetherness We roamed the whole town Resting hands on each other’s shoulders . In the nets of the drizzle, we filtered The fish of our childhood stories Catching and leaving them alternatingly And were bone-tired loitering Steeped in the rain of friendship . Coming on a seasonal tour And spending this whole day with me Rain bade me good-bye. Though the clouds that brought him here had vanished, Like the brilliant smile he left behind A Rainbow stuck to the sky Like the soaked shirt sticking to my skin. . (Telugu Original: Late Dr. K. Godavari Sarma) . వాన . ఎన్నాళ్ళకో కనబడ్డ చిన్నప్పటి మిత్రుడిలా అన్ని చేతులతో చుట్టేసింది సన్నజాజి పూరేకుల్లా సున్నితంగా కురిసే వాన జల్లు. . ఎంత మంచి మిత్రుడో సుంతైనా గ్రహించని మనుషులు పొడి గడపలమీదకి చేరుకున్నారు తడవకుండా తలదాచుకున్నారు . వానా నేనూ! ఇంకెవ్వరూలేరు రోడ్డు మీద. ఎదురులేని ఏకాంతం కనక బుజాలమీద చేతులు వేసుకుని ఎప్పటికబుర్లో చెప్పుకుంటూ ఊరంతా తిరిగేశాం . చినుకుల వలల్లో చిన్నప్పటి కథల్ని చేపల్లా వడపోస్తూ వదిలేస్తూ స్నేహం జడిలో తడుస్తూ నడుస్తూ తిరిగి తిరిగి అలసిపోయాం . సీజనల్ టూర్ లో ఈ ఊరొచ్చి ఈ రోజంతా నాతో గడిపి వీడ్కోలుచెప్పి వెళ్ళిపోయింది వాన. వానని తెచ్చిన మబ్బులు మాయమైనా వాన వదిలి వెళ్ళిన చిరునవ్వులా హరివిల్లు ఆకాశాన్ని అంటుకునే ఉంది నా గుండెకి అతుక్కున్న తడిచొక్కాలా. . కె. గోదావరి శర్మ ‘అంతర్వాహిని” కవితా సంకలనం నుండి. Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… 2 వ్యాఖ్యలునవంబర్ 22, 2011