అనువాదలహరి

ఇసుక రేణువు… రాబర్ట్ విలియం సెర్విస్

.

రోదసికి హద్దులులేక,

ఒక సౌరకుటుంబం తర్వాత

ఇంకొక సౌరకుటుంబం ఎదురౌతుంటే,

మన భూమి మీద మాత్రమే

జీవరాశి ఉందనుకోడానికి

తగినకారణం కనిపించదు.

లెక్కలేనన్ని నక్షత్ర మండలాల మధ్య,

బహుశా కొన్ని లక్షల ప్రపంచాలుండవచ్చు…

ఒక్కొక్కదాన్నీ ఒక్కొక్క దేవుడు

రక్షిస్తూనో, నాశనం చేస్తూనో,

దాని ప్రస్థానాన్ని శాసిస్తూ.

ఊహించుకుంటుంటే,

ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో!!

ఒక్కొక్కప్రపంచాన్నీ నడిపిస్తూ

లక్షలమంది దేవుళ్ళూ,

వాళ్ళందరిమీదా

ఒక సర్వాధికుడైన పరమాత్మా!!!

.

అంత పెద్దపెద్ద అంకెలు

నా బుర్ర పనిచెయ్యనివ్వవు.

రోదసిలోంచి పడిపోతున్నట్టు కళ్ళుతిరుగుతాయి

నాకు చిన్న చిన్న విషయాలలోనే

మనశ్శాంతి లభిస్తుంది

ఎందుకంటే, గమనించు!

నా చుట్టూ అలా భూమి

ఒకప్రక్క ఒరిగిపోతూ తిరుగుతోందా?

నేను మాత్రం అరచేతిలో

ఒక ఇసుకరేణువును పడకుండా పట్టుకుని

దాని అర్థం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నాను.

.

ఓహ్, నాకే గనక చూడగల కళ్లుండి,

అర్థంచేసుకోగల మెదడుంటే నా!

గహనమైన జీవన మర్మాన్ని

ఈ ఇసుకరేణువులోనే కనుక్కోగలిగేవాణ్ణి

.

రాబర్ట్ విలియం సెర్విస్

16 జనవరి, 1874 – 11 సెప్టెంబరు 1958

బ్రిటిషు కవి.

.

A Grain of Sand

.

If starry space no limit knows
And sun succeeds to sun,
There is no reason to suppose
Our earth the only one.
‘Mid countless constellations cast
A million worlds may be,
With each a God to bless or blast
And steer to destiny.

Just think! A million gods or so
To guide each vital stream,
With over all to boss the show
A Deity supreme.
Such magnitudes oppress my mind;
From cosmic space it swings;
So ultimately glad to find
Relief in little things.

For look! Within my hollow hand,
While round the earth careens,
I hold a single grain of sand
And wonder what it means.
Ah! If I had the eyes to see,
And brain to understand,
I think Life’s mystery might be
Solved in this grain of sand.

.

Robert William Service

(January 16, 1874 – September 11, 1958 )

British Poet

%d bloggers like this: