అనువాదలహరి

ఏబూ బెన్ ఏడం … లే హంట్

http://www.spiritdaily.com/Crown%20of%20Mary2.jpg
Image Courtesy: http://www.spiritdaily.com

.

ఏబూ బెన్ ఏడం (అలాంటి వాళ్ళు అనేకులు వర్ధిల్లుదురు గాక!)

ప్రశాంత గాఢసుషుప్తినుండి ఒకరోజు మేల్కొన్నాడు

చంద్రకాంతితో  నిండిన అతనిగదిలో

విరుస్తున్న తెల్లకలువలా, ఇంకా కాంతివంతం చేస్తూ

పుత్తడిపుస్తకం లో రాస్తూన్న ఒక దేవదూతని చూశాడు.

.

అతిశయించిన ప్రశాంతత బెన్ ఏడం కు ధైర్యాన్నిచ్చింది

అతను ఆగదిలో ఉన్న స్వరూపాన్ని  ఆడిగేడు:

“ఏమిటి వ్రాస్తున్నావు?”అని. అపుడా తేజస్సు తలపైకెత్తి

అతి ప్రసన్నమైన వీక్షణతో ఇలా అంది:

“దేవుని ప్రేమించేవారి జాబితాని” అని

“అందులో నా పేరు  ఉందా?” అడిగేడు ఏబు. “ఉందని నేననుకోను”

అని సమాధానం ఇచ్చింది. అప్పుడు ఏబూ, నెమ్మదిగా,

అయినా ఉత్సాహంగానే అన్నాడిలా:

“అలా అయితే, నీకు నాదో చిన్న విన్నపం.

నన్ను సాటిమనిషిని ప్రేమించేవాడిగా వ్రాయి” అని.

.

దేవదూత అలాగే వ్రాసి అంతర్ధానమైపోయింది.

“మరుసటిరోజు రాత్రి మిరుమిట్లుగొలిపేకాంతితో మళ్ళీ వచ్చింది.”

వచ్చి దేముడు ఎవరిని అనుగ్రహించేడో వాళ్ల జాబితా చూపింది. 

ఆశ్చర్యం! బెన్ ఏడం పేరు అందరికంటే ముందు ఉంది.”

.

Abou Ben Adhem

.

Abou Ben Adhem (may his tribe increase!)
Awoke one night from a deep dream of peace,
And saw, within the moonlight in his room,
Making it rich, and like a lily in bloom,
An angel writing in a book of gold:—
Exceeding peace had made Ben Adhem bold,
And to the Presence in the room he said
“What writest thou?”—The vision raised its head,
And with a look made of all sweet accord,
Answered “The names of those who love the Lord.”
“And is mine one?” said Abou. “Nay, not so,”
Replied the angel. Abou spoke more low,
But cheerly still, and said “I pray thee, then,
Write me as one that loves his fellow men.”

The angel wrote, and vanished. The next night
It came again with a great wakening light,
And showed the names whom love of God had blessed,
And lo! Ben Adhem’s name led all the rest

.

James Henry Leigh Hunt

(19 October 1784 – 28 August 1859)

British critic, essayist, poet and writer.

%d bloggers like this: