Bangles of My Mother … Yendluri Sudhakar Image Courtesy: http://t1.gstatic.com (As a tribute to my Mother on her 12th Death Anniversary today) . Whenever I look at the bangleless hands of my mother, They remind me of a blank starless sky, Barren branches sans flowers Play before my bleary eyes. . Those bangles… Which jingled with such inexpressible sweetness When she put the childy me to sleep Or bathed me or gave me breast caressing my head… Still reverberate their echoes within me . I still remember those hands hurt and wounded When father struck her in anger . They used to break like pods of cotton When she pounded chillies, Broke firewood to faggots, or As she dish-washed . It was such a merry pastime in my childhood To passionately collect those fragments and Make colourful chains welding over lamp flame . Whenever the bangles saheb came and opened his box, We children used to collect around him no sooner Like a bevy of bees And flew about that colourful world Like butterflies struck with wonder and awe . When mother donned a new saree some festive day and Wore parrot-green or light red or violet bangles, It looked as if rainbows have alighted on her hands . Whenever she wore stone bangles, It seemed as if stars were studded on her celestial hands . When I rapturously counted my mother’s bangles, I felt they were my kin And whenever I touched her bangles-box, They greeted me from inside in their voice . Now, mother’s bangles have grown silent . For, the last time when I witnessed her bangles being Dashed against father’s grave, I think I heard The rending of the sky into two And bursting to pieces . Mother’s bangles might have splintered to smithereens But my bangles of their memories hold intact Her glistening hands, full of bangles, Just as they were in my childhood, Spread across my eyes … still . Yendluri Sudhakar . అమ్మ గాజులు. . గాజుల్లేని అమ్మ చేతులు చూస్తున్నప్పుడల్లా చుక్కల్లేని బోసి ఆకాశమే కనబడుతుంది. పూలులేని మొండికొమ్మలు కంటిముందు కన్నీళ్ళై కదులుతుంటాయి. చిన్నప్పుడు జోకొట్టి నిదురపుచ్చుతున్నప్పుడూ కాళ్ళమీద పడుకోపెట్టి స్నానం చేయిస్తున్నప్పుడూ అక్కున అదుముకుని తల నిమురుతూ పాలు తాగిస్తున్నప్పుడూ అవ్యక్త మధురంగామోగిన గాజులు నాలో ఇంకా నినదిస్తూనే ఉన్నాయి. కోపంతో నాన్నకొట్టినప్పుడు గుచ్చుకుని గాయాలైన అమ్మ చేతులు నాకిప్పటికీ గుర్తున్నాయి. కారం దంచుతున్నప్పుడూ కట్టెలు కొడుతున్నప్పుడూ బాసాండ్లు తోముతున్నప్పుడూ అమ్మగాజులు పత్తికాయల్లా భళ్ళున పగులుతుండేవి. పగిలిన అమ్మగాజుల్ని ప్రేమగా ఏరుకుని దీపం సెగలో ముక్కల్ని జత చేస్తూ రంగు రంగుల గాజు గొలుసులు చేసి ఆడుకోవడం చిన్నప్పుడు గొప్ప సరదాగా వుండేది. గాజుల సాహేబు పెట్టె దించి బిచానా పరచగానే పిల్లలమంతా చయ్యన తేనెటీగల్లా మూగేవాళ్ళం. సంతోష సంభ్రమాశ్చర్య రేఖలమై ఆ రంగుల ప్రపంచం చుట్టూ సీతాకోకచిలకలమై ఎగిరేవాళ్ళం. ఏపండుగ రోజునో అమ్మ కొత్త చీర కట్టుకుని చిలకపచ్చవో మొలకకెంపువో ఊదారంగు గాజులో తొడుక్కున్నప్పుడు అమ్మచేతులమీద ఇంద్ర ధనుస్సులు వాలినట్లుండేవి. అమ్మ రాళ్ళగాజులు ధరించినప్పుడల్లా అమ్మ ఆకాశ హస్తాలకు నక్షత్రాలు పొదిగినట్లుండేవి. అమ్మగాజుల్ని ఆప్యాయంగా లెక్కపెడుతున్నప్పుడు అవి నా తోబుట్టువుల్లాగే అనిపించేవి. అమ్మ గాజుల డబ్బాతాకినప్పుడల్లా లోపలినుంచి గాజుగొంతులు నన్ను పలకరించేవి. . ఇప్పుడు అమ్మ గాజులు మూగబోయాయి. చివరి సారి నాన్న సమాధిముందు అమ్మగాజుల్ని నాకళ్ళముందే పగులగొడ్తున్నప్పుడు సగం ఆకాశం ముక్కలై విరిగి పడుతున్న చప్పుడు. అమ్మ గాజులు ముక్కలై రాలిపోయినా నా జ్ఞాపకాల గాజులు మాత్రం చెక్కుచెదరలేదు. నాకిప్పటికీ నిండుగాజుల్తోనిగనిగ మెరిసే నా చిన్నప్పటి అమ్మ చేతులే కళ్ళనిండా పరుచుకున్నాయి. . ఎండ్లూరి సుధాకర్ Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… 4 వ్యాఖ్యలునవంబర్ 18, 2011