అందరితో పాటు ఒంటరిగా… ఛార్ల్స్ బ్యుకోస్కి

.
ఎముకని
మాంసం కప్పుతుంది.
అక్కడొక మనసుని తగిలించి,
అప్పుడప్పుడు
ఒక ఆత్మనుకూడా వేలాడదీస్తారు
స్త్రీలు
పాత్రల్ని
గోడకేసిపగలగొడుతుంటారు,
మగాళ్ళు
పూటుగా తాగుతుంటారు
ఎవరికీ
తమకి కావలిసినది
దొరకదు
కానీ వెదుకుతూ,
పక్కలమీదపడి
లేస్తూ ఉంటారు
ఎముకని
మాంసం కప్పి ఉంచుతుంది,
తనువులు
తనువులని మించి
ఇంకేదో
వెతుక్కుంటుంటాయి
.
తప్పించుకునే మార్గం
అస్సలు లేదు.
అందరూ
ఈ చిత్రమైన విధికి
చిక్కుకున్నారు
ఎవరికీ
ఎప్పుడూ
కావలసినది దొరకదు
.
నగరాల్లో పెంటకుప్పలు నిండిపోతాయి,
తుక్కు వాకిళ్ళు నిండిపోతాయి,
పిచ్చాసుపత్రులు నిండిపోతాయి,
ఆసుపత్రులు నిండిపోతాయి,
శ్మశానాలు నిండిపోతాయి.
.
ఇక నిండడానికి ఏదీ మిగలదు
.
ఛార్ల్స్ బ్యుకోస్కి
(ఆగస్టు 16, 1920 మార్చి 9, 1994)
అమెరికను కవి, నవలాకారుడూ, కథా రచయిత.
.
Alone with everybody …
.