అనువాదలహరి

సహానుభూతి … ఎమిలీ బ్రాంటి

http://www.sympathy-quotes.com/wp-content/uploads/2009/09/Sympathy-Card-019-450x281.jpg
Image Courtesy: http://www.sympathy-quotes.com

.

రాత్రి నక్షత్రాలు ప్రకాశిస్తున్నంత సేపూ,

సాయంత్రాలు నిశ్శబ్దంగా మంచు కురుస్తున్నంతసేపూ,

ఉదయానికి సూర్యకాంతి బంగరుపూత పూస్తున్నంతసేపూ

నువ్వు నిరాశపడవలసిన పని లేదు.

కన్నీరు నదులై ప్రవహిస్తే ప్రవహించనీ,

అయినా, నువ్వు నిరాశాపడవలసిన పని లేదు. 

అత్యంత ప్రేమాస్పదమైన వత్సరాలు

నీ గుండెల్లో శాశ్వతంగా లేవూ?

.

అవీ ఏడుస్తాయినువ్వూ,  ఏడుస్తావు… అది సహజమే

ఋతుపవనాలు నీలాగే నిట్టూరుస్తాయి,

హేమంతం తన దుఃఖాన్ని మంచులా కురుస్తుంది

శిశిరానికి** రాలిన ఆకుల గుట్టల మీద

అయినా, అవి తిరిగి పుంజుకుంటాయి

నీ విధివ్రాత అంతకంటే భిన్నంగా ఎలా ఉండగలదు?

పద, పద! ముందుకి అడుగెయ్యి! ఉల్లాసం లేకపోవచ్చు,

కాని దుఃఖభరమైనగుండెతోమాత్రం నడవకు.

.

(** మన ఋతువులకి, వాళ్ళ ఋతువులకి ఉన్న భేదం గమనించగలరు. )

.

ఎమిలీ బ్రాంటి

.

Sympathy

.

There should be no despair for you
While nightly stars are burning;
While evening pours its silent dew
And sunshine gilds the morning.
There should be no despair – though tears
May flow down like a river:
Are not the best beloved of years
Around your heart forever?

They weep – you weep – it must be so;
Winds sigh as you are sighing,
And Winter sheds his grief in snow
Where Autumn’s leaves are lying:
Yet these revive, and from their fate
Your fate cannot be parted:
Then journey on, if not elate,
Still, never broken-hearted! 

.

Emily Bronte

(** మన ఋతువులకి, వాళ్ళ ఋతువులకి ఉన్న భేదం గమనించగలరు. )

%d bloggers like this: