అనువాదలహరి

మిల మిల మెరియవె చిని తారా… జేన్ టేలర్ (Twinkle Twinkle Little star)

http://3.bp.blogspot.com/-JF4O35M7-7c/Tgz7xMByKVI/AAAAAAAAAyQ/OeexQgR6E98/s1600/twinkle-little-star.jpg
Image Courtesy: http://3.bp.blogspot.com

.

మిల మిల మెరియవె చిని తారా!

ఎంత అందంగా ఉన్నావు రా,

భూమికి చాలా దూరంగా,

ఆకాశానా వజ్రం లా.

.

మండే సూర్యుడు గుంకగనే,

మెరిసే వస్తువు కనకుంటే,

వెలుగులు నీవవి ప్రసరిస్తావ్,

రేయంతా నువు మెరుస్తుంటావ్.

.

చిక్కని చీకటి నడిచేరూ, నీ

వెలుగుని గొప్పగ పొగిడేరూ,

వెలుగే నీదది లేకుంటే,

ఎటుపోవాలో తెలియదులే.

.

నల్లని నింగిని ఉంటూనే, నా

కిటికీ తెరలోంచి చూస్తావే,

సూర్యుడు తిరిగొచ్చేదాకా,

రెప్పే వెయ్యవు రాత్రంతా

.

నీ, దెంతచిన్నటి వెలుగైనా,

నడిచే దారిని చూపేను,

నువ్వెవరో? నాకు తెలియదులే,

మిల మిల మెరియవె, చిని తారా!

.

జేన్ టేలర్ (Jane Taylor)

(23 సెప్టెంబరు 1783 – 13 ఏప్రిల్ 1824)

బ్రిటిషు కవయిత్రి, వ్యాసకర్త.

ప్రపంచవ్యాప్తంగా పిల్లలనోటిలో గత రెండుశతాబ్దాలుగా నలుగుతున్నా, ఈ పాట రచయిత్రి జేన్ టేలర్ అని చాలామందికి తెలియదు. అంతేకాదు, దాని కారణంగా దీనికి ఎన్నో పాఠాంతరాలూ, అనుకరణలు కూడా వచ్చేయి.  తన 30వ యేట బ్రెస్ట్ కాన్సరుతో చనిపోయిన జేన్ (Jane) తన అక్క ఏన్ (Anne Taylor) టేలర్ తో కలిసి వ్రాసిన అనేక నర్సరీగీతాలలో ఆమెకు అజరామరమైన కీర్తి తీసుకువచ్చింది ఈ గీతమే.

.

The Star

.

Twinkle , twinkle, little star,
How I wonder what you are
Up above the world so high,
Like a diamond in the sky.

When the blazing sun is gone,
When he nothing shines upon,
Then you show your little light,
Tinkle, twinkle, all the night.

Then the trav’ller in the dark,
Thanks you for your tiny spark,
He could not see which way to go,
If you did not twinkle so.

In the dark blue sky you keep,
And often thro’ my curtains peep,
For you never shut your eye,
Till the sun is in the sky.

‘Tis your bright and tiny spark,
Lights the trav’ller in the dark,_
Though I know not what you are.
Twinkle, twinkle, little star.
.

1806

Jane  Taylor

(23 September 1783 – 13 April 1824)
%d bloggers like this: