అనువాదలహరి

గుర్తుంచుకో … క్రిస్టినా రోజెటి

http://dsatdiplopundit.googlepages.com/486841134_6800a34d0f_o_wallwithhand_.jpg
Image Courtesy: http://dsatdiplopundit.googlepages.com

.

నేను పోయినా,

సుదూర నిశ్శబ్ద లోకాలకు వెళ్ళిపోయినా…

నన్ను గుర్తుంచుకో.

నన్నపుడు నువ్వు చెయ్యిపట్టుకుని నడిపించనూలేవు,

నాకు ఉండాలనిపించినా సగం వెనుతిరిగి, ఉండిపోనూలేను

నీ భవిష్యత్ ప్రణాళికలు

ఇక ఎప్పటిలా ఏరోజుకారోజు చెప్పలేవు

నన్ను గుర్తుంచుకో. అంతే!

ఇప్పుడిక సలహాలివ్వడానికి గాని,

ప్రార్థించడానికిగాని సమయం లేదు.

ఒకవేళ నువ్వు నన్ను కాసేపు మరిచిపోయి,

తర్వాత ఎప్పుడో గుర్తొస్తే, దిగులుపడకు.

కాలక్రమంలో కొంత మరుపువచ్చి,

నా ఆలోచనల ఆనవాళ్ళు లీలగానే గుర్తున్నపుడు,

నువ్వు నన్ను గుర్తుంచుకుని బాధపడేకంటే,

నన్ను మరచిపోయి హాయిగా నవ్వగలగడమే నే కోరుకునేది

.

క్రిస్టినా రోజెటి

(5 డిశెంబరు 1830 – 29 డిశెంబరు 1894)

బ్రిటిషు కవయిత్రి.

Ellen Alleyne అన్న మారుపేరుతో 1850 లో కవితలు ప్రచురించినా, 1862లో మాక్మిలను కంపెనీ ప్రచిరించిన Goblin Market And Other Poems తో ఆమె కవయిత్రిగా స్థిరపడింది. Goblin Market, Remember అన్న ప్రేమ గీతం,   In the Bleak Midwinter అన్న Christmas carol ఆమెకు మంచి కీర్తిని సంపాదించి పెట్టేయి.

.

REMEMBER

.

Remember me when I am gone away,  
Gone far away into the silent land;  
When you can no more hold me by the hand,  
Nor I half turn to go, yet turning stay.  
Remember me when no more day by day
You tell me of our future that you plann’d:  
Only remember me; you understand  
It will be late to counsel then or pray.  
Yet if you should forget me for a while  
And afterwards remember, do not grieve:
For if the darkness and corruption leave  
A vestige of the thoughts that once I had,  
Better by far you should forget and smile  
Than that you should remember and be sad.

.

Christina Georgina Rosetti

(5 December 1830 – 29 December 1894)

British Poet

%d bloggers like this: