వృధ్ధ విరాగి … ఎమిలీ బ్రాంటి
- Image Courtesy: http://1.bp.blogspot.com
Listen to the Poem here: The Old Stoic
.
సంపదలు విలువైనవిగా భావించను,
ప్రేమ? ఆ మాటంటేనే నాకు నవ్వొస్తుంది,
కీర్తి కాంక్ష ఒక కల
ఉదయమవుతూనే కరిగిపోతుంది
.
నేను ప్రార్థించడమంటూ జరిగితే
నా పెదాలమీద కదిలే మాటలు ఒకటే:
నా మనసు నా అధీనంలో వదిలీ
నాకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదించు!
.
అవును. నా రోజులు తొందరగా లక్ష్యాన్ని సమీపిస్తున్నకొద్దీ,
జీవనం లోనూ, మరణం లోనూ, నే కోరుకునేది,
సంకెలలులేని మనసూ,
దేన్నైనా ఎదుర్కోగల ఆత్మ స్థైర్యమూ. అంతే!
.
ఎమిలీ బ్రాంటి
బ్రిటిషు నవలాకారిణి, కవయిత్రి
(30 జులై 1818 – 19 డిసెంబర్ 1848)
ఎమిలీ బ్రాంటి అనగానే ఛప్పున గుర్తొచ్చేది Wuthering Heights అన్న నవల. Ellis Bell మారుపేరుతో ప్రచురితమైన ఈ నవల మొదట్లో అంత ఆదరణకు నోచుకోపోయినా, ఆమె మరణం తర్వాత విమర్శకుల మన్ననలతో పాటు, ఇంగ్లీషు సాహిత్యం లో ఒక క్లాసిక్ గా గుర్తింపబడుతోంది.
.
The Old Stoic
.
Riches I hold in light esteem;
And Love I laugh to scorn;
And lust of fame was but a dream
That vanished with the morn:
.
And if I pray, the only prayer
That moves my lips for me
Is, ‘Leave the heart that now I bear,
And give me liberty!’
.
Yes, as my swift days near their goal,
‘Tis all that I implore;
In life and death, a chainless soul,
With courage to endure.
.
(1846)
- Image Courtesy: http://en.wikipedia.org