జీవితం … ఛార్లెట్ బ్రాంటి

http://www.goodlightscraps.com/content/life-quotes/life-quotes-15.jpg
Image Courtesy: http://www.goodlightscraps.com

.

నా మాట నమ్ము!

జీవితం పండితులు చెప్పినంత పీడకల కాదు.

సాధారణంగా, ఉదయాన్నే చినుకులు పలకరిస్తే,

అది, రోజంతా ఆహ్లాదకరంగా ఉండడాన్నిసూచిస్తుంది

.

అప్పుడప్పుడు చింతల మేఘాలు ఆవరిస్తుంటాయి,

కానీ, అవి తాత్కాలికం.

ఒక జల్లు గులాబీమొగ్గలను వికసింపజెయ్యగలిగినపుడు,

అవి రాలిపోతే బాధపడటం దేనికి?

.

జీవితపుటానంద ఘడియలు,

హాయిగా, తెలియకుండా దొర్లిపోతాయి.

కృతజ్ఞతతో, సంతోషంతో

వాటిని  అనుభవించు యథాతథంగా

.

అప్పుడప్పుడు మృత్యువు మధ్యలో చొరబడి

మనలో మంచివాళ్ళని ఎత్తుకుపోతేనేం?

విషాదం, ప్రభావశాలియైన ఆశమీద

గెలిచినట్టు కనిపిస్తేనేం?

.

ఓటమిఎరుగని ఆశ క్రిందపడినా

మళ్ళీ పైకిలేస్తుంది; దాని బంగారురెక్కలు

ఎప్పుడూ ఎగరగలిగేస్థితిలోనే ఉంటాయి,

మనల్ని మూపున భరించగలశక్తి వాటికెప్పుడూ ఉంటుంది

.

కాబట్టి, ధైర్యంగా, నిర్భయంగా,

ఏ విషమపరీక్షనైనా ఎదుర్కో!

అంత గొప్పగానూ, జయప్రదంగానూ,

ధైర్యం నిరాశని తుదముట్టిస్తుంది.

.

ఛార్లెట్ బ్రాంటి

21 April 1816 – 31 March 1855

బ్రాంటి సిస్టర్స్ గా కీర్తిగడించిన ముగ్గురిలో  ఛార్లెట్ పెద్దది.  తను అజ్ఞాతంగా

ప్రచురించిన Jane Eyre నవల మిక్కిలి ప్రజాదరణ నోచుకోవడంతో ఆమె

బయటపడక తప్పలేదు. ఆంగ్ల సాహిత్యం లో Feminism కి తెరతీసిన

నవలగా దీని విమర్శకులు పేర్కొంటారు.

.

LIFE

.

Life, believe, is not a dream

So dark as sages say;

Oft a little morning rain

Foretells a pleasant day.

Sometimes there are clouds of gloom,

But these are transient all;

If the shower will make the roses bloom,

O why lament its fall ?

.

Rapidly, merrily,

Life’s sunny hours flit by,

Gratefully, cheerily,

Enjoy them as they fly !

.

What though Death at times steps in

And calls our Best away ?

What though sorrow seems to win,

O’er hope, a heavy sway ?

Yet hope again elastic springs,

Unconquered, though she fell;

Still buoyant are her golden wings,

Still strong to bear us well.

Manfully, fearlessly,

The day of trial bear,

For gloriously, victoriously,

Can courage quell despair !

.

http://t1.gstatic.com/images?q=tbn:ANd9GcTLrC4LRLrxOEKY1Pr5xq7Tutf8-10JGhk53W9RyJAgdy8vK5t-
Image Courtesy: http://t1.gstatic.com

Charlotte Bronte 


21 April 1816 – 31 March 1855

British Novelist and Poet

“జీవితం … ఛార్లెట్ బ్రాంటి” కి 2 స్పందనలు

  1. చాలా బాగుందండీ! నేను మీ అనువాద కవితల్ని క్రమం తప్పకుండా చదువుతాను!
    శారద

    మెచ్చుకోండి

    1. శారదగారూ,
      కృతజ్ఞతలు. మీకు నచ్చకపోతే, ఎందుకు, ఎక్కడ నచ్చలేదో వ్రాస్తే, వాటిని ఇంకా మెరుగుపరచడానికి అవకాశాలు ఉంటాయి.
      నా బ్లాగును ఆదరిస్తున్నందుకు మరోసారి కృతజ్ఞతలు.
      మూర్తి.

      మెచ్చుకోండి

Leave a reply to sunamu స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.