రోజు: నవంబర్ 11, 2011
-
జీవితం … ఛార్లెట్ బ్రాంటి
Image Courtesy: http://www.goodlightscraps.com . నా మాట నమ్ము! జీవితం పండితులు చెప్పినంత పీడకల కాదు. సాధారణంగా, ఉదయాన్నే చినుకులు పలకరిస్తే, అది, రోజంతా ఆహ్లాదకరంగా ఉండడాన్నిసూచిస్తుంది . అప్పుడప్పుడు చింతల మేఘాలు ఆవరిస్తుంటాయి, కానీ, అవి తాత్కాలికం. ఒక జల్లు గులాబీమొగ్గలను వికసింపజెయ్యగలిగినపుడు, అవి రాలిపోతే బాధపడటం దేనికి? . జీవితపుటానంద ఘడియలు, హాయిగా, తెలియకుండా దొర్లిపోతాయి. కృతజ్ఞతతో, సంతోషంతో వాటిని అనుభవించు యథాతథంగా . అప్పుడప్పుడు మృత్యువు మధ్యలో చొరబడి మనలో మంచివాళ్ళని ఎత్తుకుపోతేనేం?…