చెట్లు … జాయిస్ కిల్మర్

.
చెట్టుకంటే అందమైన కవిత
ఎక్కడైనా ఉంటుందని నేననుకోను
.
పుడమితల్లి వెల్లువల స్తన్యానికి
ఆకొన్న నోటిని ఆబగా అదిమే …చెట్టు
.
ప్రతిరోజూ దేవుని దర్శిస్తూ,
తన పత్రహస్తాలను మోడ్చి ప్రార్థించే … చెట్టు
.
మండు వేసవిలో చెండులా తనతలలో
గొరవంక గూళ్లను ధరించే… చెట్టు
.
గుండెలపై మంచు గువ్వలా వాలే … చెట్టు
వర్షధారలలో మమేకమైన … చెట్టు
.
కవితకేముంది… నాలాంటి మూర్ఖుడెవడైనా రాయగలడు,
కానీ, చెట్టుని మాత్రం ఒక్క దేవుడే సృష్టించగలడు.
.
జాయిస్ కిల్మర్
(6th Dec 1886 – 30th July 1918)
అమెరికను కవి, సైనికుడు
( జాన్సన్ & జాన్సన్ వారి బేబీ పౌడర్ కనిపెట్టిన డా. ఫ్రెడెరిక్ బార్నెట్ కిల్మర్ కుమారుడు)
.
TREES