అనువాదలహరి

నీ ముక్కు ముఖమ్మీదే ఉన్నందుకు సంతోషించు… జాక్ ప్రెలుస్కీ

http://t1.gstatic.com/images?q=tbn:ANd9GcSYH-BQUj90uWeKmBeMRdFYRR1hb3T1gEa8ceILcz1CrD1YL6HilqadWBKG6A
Image Courtesy: http://t1.gstatic.com

.

నీ ముక్కు నీ ముఖం మీద ఉన్నందుకు సంతోషించు,

ఇంకెక్కడో అతకబడకుండా. ఎందుకంటే,

అది ఉన్నచోట కాకుండా ఇంకోచోట ఉండి ఉంటే,

నీ ముక్కుని నువ్వే చాలా అసహ్యించుకోవచ్చు

.

మాటవరసకి, నీ కుదురైన ముక్కు

కాలివేళ్ల మధ్య ఉందనుకుందాం.

ఖచ్చితంగా అది చూడ్డానికి  అస్సలు బాగుండదు.

మీదుమిక్కిలి, నీ కాళ్ళు నువ్వు వాసనచూడాల్సి వస్తుంది

.

అదే నెత్తిమీద అతికించి ఉందనుకుందాం.

అప్పుడది చూడ్డానికి మహాభయంకరంగా  ఉంటుంది.

నీ వెంట్రుకలు నిత్యం దాన్ని గిలిగింతలుపెడుతుంటే,

నీకు నిజంగా పిచ్చెక్కిపోతుంది

.

పొరపాటున అది నీ చెవులో ఉందనుకుంటే,

అంతకన్నా వేరే ఘోరం ఇంకోటుండదు.

ఎందుకంటే, నీకు తుమ్మొచ్చినప్పుడల్లా,

నీ మెదడు టపటపా కొట్టుకుంటుంది

.

వీటన్నిటికీ బదులు, ఎక్కడో అతికీకుండా,

నీ ముక్కు ఎంచక్కా నీ కళ్ళకీ,

చిబుకానికీ మధ్యన చక్కగా అమరి ఉంది.

సంతోషించు! నీ ముక్కు నీ ముఖం మీదే ఉంది.

.

జాక్ ప్రెలుస్కీ

(8 సెప్టెంబరు, 1940 —)

అమెరికను కవి

(మనిషి ప్రకృతి తనకిచ్చిన వరాల్ని గ్రహించలేక, ఎప్పుడూ ఏదో వెలితితో బాధపడుతూనే ఉంటాడు. ముక్కు ఉన్నచోట ఉండడం లోని సౌందర్యాన్ని వస్తువుగా తీసుకుని, మనమెంత  కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోవాలో కవి పరోక్షంగా చెబుతున్నాడు. )

.

Be Glad Your Nose is on Your Face

.

Be glad your nose is on your face,
not pasted on some other place,
for if it were where it is not,
you might dislike your nose a lot.
.

Imagine if your precious nose
were sandwiched in between your toes,
that clearly would not be a treat,
for you’d be forced to smell your feet
.
Your nose would be a source of dread
were it attached atop your head,
it soon would drive you to despair,
forever tickled by your hair.
.
Within your ear, your nose would be
an absolute catastrophe,
for when you were obliged to sneeze,
your brain would rattle from the breeze.
.
Your nose, instead, through thick and thin,
remains between your eyes and chin,
not pasted on some other place–
be glad your nose is on your face! 

.
Jack Prelutsky 

(8th Sept 1940- )

American Poet

%d bloggers like this: