అనువాదలహరి

జరుగబోయే యుధ్ధం … విల్ప్రెడ్ ఓవెన్

      

http://t3.gstatic.com/images?q=tbn:ANd9GcQb721V45K3szYQuXcrF-fXWnVYvs1AFEDDww7zPAwOYpWlx43P
Image Courtesy: http://t3.gstatic.com

       .

       చనిపోయే దాకా అక్కడ కలిసే తిరిగేము,

       అతనితో చాలా స్నేహంగా, సరదాగాఉన్నాం.

       కూచున్నాం, కలిసే భోజనంచేసేం.

       మా చేతుల్లోంచి కంచాలు తుళ్ళగొట్టినపుడు మన్నించేము.

       అతని చిక్కని, పచ్చని ఊపిరి పొగలను పీల్చేము.

       .

       మా కళ్ళు ఏడ్చినా, మా ధైర్యం సడలలేదు.

       మా మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తే, మేం అతని మీద ఫిరంగుల్ని వర్షించేము.   

       అతను గొంతెత్తి పాడినపుడు వెనుక వంత పాడేము.

       అతని కరవాలాలు  వెంట్రుకవాసిలో  గురితప్పినపుడు,

       మేం ఆనందంతో ఈలలేసేము       

       .

       ఓహ్, మృత్యువెన్నడూ మాకు శత్రువు కాదు

       ఆ ముసలాడితో జట్టుకట్టేం, అతనితో పరాచికాలాడేము

       అతని శక్తినెదిరించి బతగ్గలిగినవాడు లేడు

       మా కంటే సమర్థులైన యోధులు వస్తారనీ,

       ఇంతకంటే భీకరమైన యుధ్ధాలు జరుగుతాయనీ తెలుసుగనుకనే,

       ఏ సైనికుడైనా గర్వంగా

      “తను ప్రాణాలను రక్షించడానికి మృత్యువుతో పోరాటం చేస్తున్నాననీ;

       మనుషులకోసం కాదు- దేశం కోసమనీ”

       అని దంబాలు పలికినపుడు విని నవ్వుకున్నాం

       .

       విల్ప్రెడ్ ఓవెన్  (మార్చి 18, 1893 – నవంబరు 4, 2018)

మొదటి ప్రపంచ సంగ్రామం ముగియడానికి సరిగ్గా వారం రోజులు ముందు మరణించిన బ్రిటిషు కవీ, సైనికుడూ అయిన ఈ యువకుని కీర్తి శాశ్వతంగా నిలవడానికి అతని కవితలూ, అందులో వెలిబుచ్చిన యుధ్ధోన్మాదం వల్ల ఏమీ ప్రయోజనం లేదన్న సందేశమే. కానీ, చిత్రమేమిటంటే,ఇప్పటికీ, పాలకవర్గాల మనస్తత్వంలో మార్పు లేకపోవడమే, యువకులు యుధ్ధాలలో బలికావడమే

ఈ కవితలో అతను మృత్యువును సైనికుడికి స్నేహితుడిగా అభివర్ణిస్తాడు. ఎందుకంటే,సైనికుడెప్పుడూ మృత్యువుతోనే ఆడుకుంటాడు గనుక.

       .

        The Next War

        .

        Out there, we’ve walked quite friendly up to Death;

        Sat down an eaten with him, cool and bland, –

        Pardoned his spilling mess-tins in our hand.

        We’ve sniffed the green thick odour of his breath, –

        Our eyes wept, but our courage didn’t writhe.

        He’s spat at us with bullets and he’s coughed

        Shrapnel. We chorused when he sang aloft;

        We whistled while he shaved us with his scythe.

        Oh, Death was never enemy of ours!

        We laughed at him, we leagued with him, old chum.

        No soldier’s paid to kick against his powers.

        We laughed, knowing that better men would come,

        And greater wars; when each proud fighter brags

        He wars on Death – for lives; not men – for flags.

        .

       Wilfred Owen

Wilfred Edward Salter Owen (18 March 1893 – 4 November 1918) was a British poet and soldier.

(Note: “No soldier’s paid to kick against his powers” is an idiom parallel to “It is hard for you to  kick against the pricks.” Acts 9:5. Its meaning is that it doesn’t pay to kick against his powers, (i.e. Death, here) because, the more you kick, the more you shall get into it.)

%d bloggers like this: