
.
ఆశ ఒక రెక్కతొడిగిన పిట్ట…
అది మనసు చివురులమీద వాలి
నిర్విరామంగా రాగం తీస్తూనే ఉంటుంది
పదాల్లేని పదం ఏదో.
.
మలయమారుతంలో అది మరీ కమ్మగా వినిపిస్తుంది
తుఫాను ఎంతభీకరంగా ఉన్నా,
ఎంతోమందిని నులివెచ్చగా ఉంచగలిగినందుకు
ఆ చిన్ని పిట్ట సిగ్గులుపోతుంది
.
ఆ రాగం అత్యంత శీతల ప్రదేశాల్లో విన్నాను
వినూత్న సాగరాలమీద విన్నాను
కానీ, ఎంత విషమ పరిస్థితుల్లోనూ
నా ‘కిది’ కావాలని అది నన్నెన్నడూ కోరలేదు.
.
ఎమిలీ డికిన్సన్
.
“Hope” is the thing with feathers
254
.
“Hope” is the thing with feathers—
That perches in the soul—
And sings the tune without the words—
And never stops—at all—
.
And sweetest—in the Gale—is heard—
And sore must be the storm—
That could abash the little Bird
That kept so many warm—
.
స్పందించండి