అనువాదలహరి

ఈ క్షణం … లార్డ్ బైరన్

http://www.enlightphoto.com/webpages/ca_EastBayHills/lmo-1294_600.jpg
Image Courtesy: http://www.enlightphoto.com

.

మావి గుబురులలోనుండి

కోయిల పంచమస్వరాలు వినిపించేది ఈ క్షణమే …

ప్రేమికుల రహస్యవాగ్దానాలలోని ప్రతి మాటా

మధురంగా వినిపించేది ఈ వేళలోనే …

సమీపంలోని ప్రతి తెమ్మెరా, ప్రతి అలా

ఏకాంతంలో వీనులకు సంగీతపు విందు చేసేదీ ఈ సమయమే…

తుహినబిందువులు పువ్వులపై లలిత లలితంగా రాలేదీ,

ఆకసాన తారకలు కలిసేదీ,

కెరటపుటంచున తొలి నీలి మెరుగు మెరిసేదీ,

ముదురాకున కావిరంగు కవిసేదీ ఈ క్షణమే…

సాయం సంధ్యననుసరించిన చీకటి,

గహన గగనాంతరాన వ్యాపించిన మెత్తని చీకటి, చిక్కని స్వఛ్ఛపు చీకటి,

దిగంతాన చంద్రునితోపాటు కరుగుతున్న ప్రత్యూషలా, 

కరిగిపోతోందీ… ఈ క్షణమే

.

జార్జ్ గార్డన్ లార్డ్ బైరన్

.

It Is The Hour

.

It is the hour when from the boughs

The nightingale’s high note is heard;

It is the hour — when lover’s vows

Seem sweet in every whisper’d word;

And gentle winds and waters near,

Make music to the lonely ear.

Each flower the dews have lightly wet,

And in the sky the stars are met,

And on the wave is deeper blue,

And on the leaf a browner hue,

And in the Heaven that clear obscure

So softly dark, and darkly pure,

That follows the decline of day

As twilight melts beneath the moon away.

.

George Gordon Lord Byron

(22 January 1788 – 19 April 1824)

%d bloggers like this: