రోజు: అక్టోబర్ 31, 2011
-
ఓజిమాండియస్ … షెల్లీ
. నేనొక పురాదేశపుయాత్రికుడిని కలిసేను అతనన్నాడుగదా: “ఎడారిలో నేను శిల్పాకృతిలో రెండు మహోన్నతమైన పాదాలు మొండివి, చూసేను. దగ్గరలోనే ఇసుకలో సగం కప్పబడి చెదిరిన శిరస్సుకూడా కనిపించింది. ఆ ముఖంమీద చిట్లించిన నొసలు, మడిచిన క్రింది పెదవీ, అపహసిస్తున్న అధికార దర్పమూ, నిర్జీవమైన ఆ శిలలో ఎంత సజీవంగా అచ్చుగుద్దినట్టు ప్రతిఫలిస్తున్నాయంటే, ఆ శిల్పి ఎవరో ఆ వెక్కిరించిన చేతినీ, ఆవేశపూరితమైన హృదయాన్నీ బాగా చదివేడని తెలుస్తోంది. అక్కడ పీఠం మీద ఈ మాటలు చెక్కి ఉన్నాయి: […]