రోజు: అక్టోబర్ 29, 2011
-
షేక్స్పియర్ … సానెట్ 18
. నిన్నొక గ్రీష్మోదయముతో సరిపోల్తునా? కానీ, నువ్వు దానికంటే మనోహరంగా, మితోష్ణంగా ఉంటావు. మే వడగాడ్పులు కుసుమిస్తున్న లేత మొగ్గల్ని కుదిపేస్తాయి, అయినా, వేసవి నిడివి అనగా అదెంత ? ఒకోసారి దినకరుడు మరీ తీక్ష్ణంగా ప్రకాశిస్తాడు, తరచు అతని స్వర్ణరోచిస్సులు మేఘాఛ్ఛాదనకు గురౌతాయి. అదిగాక, ప్రతి సౌందర్యమూ, తన సౌందర్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు వీడవలసిందే… సంభవతవలననో, ప్రకృతిపరివర్తనవల్లనో… మరి చక్కబడదు. కానీ, నీ వాయని వెచ్చదనం శాశ్వతం. ఇసుమంతైనా వాడని సౌందర్యం నీ సొత్తు. అనశ్వరమైన […]