ఆకాసంనుండి మంద్రంగా జాలువారే వర్షాకాలపు చిరుజల్లుని నేను
.
ప్రాభాత నీరవప్రశాంతతలో నువు కనుదెరిచినపుడు
సడిసేయక వడి ఎగిరే
ఆవృత్త ద్విజసమూహాన్ని నేను
నిశాతమస్సులో అల్లన మెరిసే మృదుతారానివహాన్ని నేను
.
నా సమాధి ప్రక్కన నిలబడి ఏడవకు
నే నక్కడ లేను. నేను మరణించలేదు
.
మేరీ ఎలిజబెత్ ఫ్రై
1932లో బాల్టిమోర్(అమెరికా)లో రాయబడి ఒక 66 సంవత్సరాలపాటు బహుళప్రచారంలో ఉన్నప్పటికీ రచయిత పేరు తెలియని 6 Couplets (ద్విపదలు) లో కనిపించే ఈ కవితకి ఘనమైన చరిత్ర ఉంది. మేరీఫ్రై అంతకుముందెప్పుడూ కవిత్వం రాయలేదు. Margaret Schwarzkopf అనే జర్మను జ్యూయిష్ వనిత నాజీలభయంకారణంగా తనతల్లి అవసానదశలో ప్రక్కనలేకపోయినందుకు విలపిస్తున్నప్పుడు, గోధుమరంగు Shopping Bag మీద మేరీ ఎలిజబెత్ ఫ్రై వ్రాసిన కవిత ఇది. తర్వాత ఆమె ఎన్ని కవితలు వ్రాసినప్పటికీ, ఇదొక్కటే చిరస్థాయిగా నిలిచిపోయింది. సార్వజనీనికమైన సత్యాన్ని ఆవిష్కరించే ఈ కవిత, 1995లో Englandలో జాతీయస్థాయిలో బహుళప్రచారం గల కవితగా ఎన్నికైంది. దీనికి ఎన్నో అనుకరణలు వచ్చాయి. సంగీతబధ్ధం చెయ్యబడింది. అనేక భాషలలోకి అనువాదం చెయ్యబడింది కూడా. ఎన్నో Funeral announcementsలో ఇది చదువబడ్దది