దూరంగా తొలగి పోకు, ఒక్క రోజుకైనా సరే! ఎందుకంటే…
ఎందుకంటే… నాకెలాచెప్పాలో తెలియడం లేదు, రోజంటే… చాలా సమయం.
ట్రైన్లన్నిట్నీ ఎక్కడో యార్డ్ లో విశ్రాంతికి తీసుకుపోతే,
ఖాళీ ప్లాట్ ఫారం మీద వాటికోసం నిరీక్షించినట్టు, నేను నీకోసం నిరీక్షిస్తుంటాను
.
నన్ను ఒక గంటసేపైనా విడిచిపెట్ట వద్దు. ఎందుకంటే,
నా పరివేదనా బిందువులు ఒక్కొక్కటీ కలిసి ప్రవాహమౌతాయి,
గూడుకై దిమ్మరిగా తిరిగే పొగ, అలా దారితప్పి తేలియాడుతూ
నాగుండెల్లోకి జొరబడి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది
.
ఓహ్, కడలితీరాన నీ ఊహాచిత్రము చెదిరిపోకుండుగాక!
నీ కన్రెప్పలు సుదూర శూన్యంలోకి చూస్తూ అల్లాడకుండుగాక!
ప్రియతమా! నన్ను ఒక క్షణం కూడా విడువకు!
ఎందుకంటే, ఆ క్షణం లో నువ్వు ఎంతో దూరం వెళ్ళిపోయి ఉంటావు
నేను చిక్కుల్లో చిక్కుకుని, వెనుదిరిగి రావా?
నన్నిలా మరణించమని విడిచిపెట్టి వెళిపోతావా?
అని అడుగుతూ, భూమంతా గాలిస్తూ ఉంటాను.
.
పాబ్లో నెరూడా
.
Don’t Go Far Off
.
Don’t go far off, not even for a day, because —
because — I don’t know how to say it: a day is long
and I will be waiting for you, as in an empty station
when the trains are parked off somewhere else, asleep.
.
Don’t leave me, even for an hour, because
then the little drops of anguish will all run together,
the smoke that roams looking for a home will drift
into me, choking my lost heart.
.
Oh, may your silhouette never dissolve on the beach;
may your eyelids never flutter into the empty distance.
Don’t leave me for a second, my dearest,
because in that moment you’ll have gone so far
I’ll wander mazily over all the earth, asking,
Will you come back? Will you leave me here, dying?
.
Pablo Neruda
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…