రోజు: అక్టోబర్ 26, 2011
-
అజేయ … విలియం ఎర్న్ స్ట్ హెన్లీ
నా బ్లాగు సందర్శకులకందరికీ దీపావళి శుభాకాంక్షలు . భూ నభోంతరాలు వ్యాపించిన కాలబిలంలా నన్ను కమ్ముకున్న ఈ నిశీధినుండి, ఎక్కడెక్కడ ఏ ఏ దేవతలున్నారో వారందరికి నా కృతజ్ఞతలు లొంగదీసుకోలేని ఆత్మ నాకున్నందుకు . పరిస్థితుల పళ్ళచక్రం పట్టి బిగించినా బాధతో మూలగనూలేదు, వెనుకంజవెయ్యనూలేదు. యాదృఛ్ఛిక సంఘటనల గాయాలకి తల రక్తసిక్తమైంది గాని అవనతం కాలేదు . ఈ క్రోధాలూ కన్నీళ్ళ సీమ కావల కనిపిస్తున్నది కేవలం మృత్యుఛ్ఛాయ ఐనా, వత్సరాల బెదిరింపుల పిదప, […]