ఒక కల మరణించింది …డొరతీ పార్కర్ Image Courtesy: http://t1.gstatic.com . ఇక్కడ ఒక కల దీర్ఘనిద్రలో ఉంది. దయచేసి మీరు చూపులు అటువైపు మరల్చి ఇక్కడనుండి నెమ్మదిగా కదలండి. జీవితంకోసం పోరాడి అలసిపోయిన తర్వాత ఎలా ఉందో చూడటానికి ప్రయత్నించకండి. దుఃఖంతో నడవొద్దు కాని కాసేపు, మీ అడుగులు నెమ్మదిగా పడినా ఫర్వాలేదు. ఇక మీ దయార్ద్రమైన పరామర్శల విషయానికొస్తే, కాలమే గాయం నయం చేస్తుందనీ, మంచిరోజులు ముందున్నాయనీ మొదలైన తియ్యని మాటలు చెప్పకండి. సత్యం ఏమిటంటే ఇక్కడ ఒక కల మరణించి ఉంది. అది అందరూ గుర్తుంచుకోవలసిన విషయం; ఒక అందమైన పువ్వు గాలికి ఊగి చెట్టునుండి రాలిపోయినపుడు, చెట్టు ఎప్పటిలాగే పూలుపూచి, ఫలవంతమవడానికి ఎదురు చూస్తూ ఉండొచ్చు, కానీ, అందులో ఈ చిట్టి సౌందర్యపు వెలితి ఉంటుంది. అందుకు అసంపూర్ణమైన ఆ అందం తలవంచక తప్పదు. ఎందుకంటే, ఒక కల దుఃఖప్రదమైన మృత్యువును చేరుకుంది కాబట్టి! . డొరతీ పార్కర్ (August 22, 1893 – June 7, 1967) . A Dream Lies Dead . A dream lies dead here. May you softly go Before this place, and turn away your eyes, Nor seek to know the look of that which dies Importuning Life for life. Walk not in woe, But, for a little, let your step be slow. And, of your mercy, be not sweetly wise With words of hope and Spring and tenderer skies. A dream lies dead; and this all mourners know: Whenever one drifted petal leaves the tree- Though white of bloom as it had been before And proudly waitful of fecundity One little loveliness can be no more; And so must Beauty bow her imperfect head Because a dream has joined the wistful dead! . Dorothy Parker (August 22, 1893 – June 7, 1967) American Poet Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే అక్టోబర్ 23, 2011
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులుఒక కల మరణించిందిడొరతీ పార్కర్తియ్యని మాటలుదీర్ఘనిద్ర A Smile On Migration— Y. Mukunda Rama Raoఅయితే … రుడ్ యార్డ్ కిప్లింగ్ స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.