అనువాదలహరి

విష వృక్షం … విలియం బ్లేక్

http://www.writeawriting.com/wp-content/uploads/2010/09/Why-did-William-Blake-Write-Wrote-The-Poison-Tree1.jpg
Image Courtesy: http://www.writeawriting.com

.

నా మిత్రుడిమీద కోపం వచ్చింది.

కారణం చెప్పాను. కోపం తగ్గిపోయింది.

నా శతృవుమీద కోపం వచ్చింది.

కారణం చెప్పలేదు. అది పెరగుతూ ఉంది.

.

దానికి భయాలతో పాదుకట్టి

రాత్రీ పగలూ నా కన్నీళ్ళు చిలకరించేను

చిరునవ్వుల సూర్యరశ్మినీ,

మెత్తని మాయమాటలనీ ప్రసరించేను

.

అది రేయింబవళ్ళు ప్రవర్థమానమై

ఇప్పుడొక సొగసైన ఆపిలుకాయగాసింది

నా శత్రువు దాన్ని పరికించాడు

అది నా సొత్తని అతనికి తెలుసు

.

రాత్రి చీకటికమ్ముకోగానే

శత్రువు నా తోటలోనికి ప్రవేశించాడు

చెట్టుకింద కాళ్ళూ చేతులూ బారజాపుకుని పడిఉండడం

ఉదయం గమనించి నేను సంతసించాను

.

విలియం బ్లేక్

28 నవంబరు 1757 -12  ఆగష్టు 1827

కవీ చిత్రకారుడూ అయిన బ్లేక్ తన జీవితకాలం లో రావలసినంత పేరు సంపాదించలేకపోయినా సమకాలీనులు అతని అభిప్రాయాలకు అతన్ని పిచ్చివాడికింద జమకట్టినా, అతని సృజనాత్మకతకీ, చిత్రకళలో అంతర్లీనంగా కనిపించే తాత్త్విక, మార్మిక ప్రకటనలకూ ఇప్పుడు Romantic Movement కి చెందిన ప్రముఖకవిగా ఇప్పుడు నీరాజనాలందుకుంటున్నాడు. ఫ్రెంచి, అమెరికను విప్లవాల ఆదర్శాలూ, భావాలయొక్క ప్రభావం అతనిమీద చాలా ఉంది.  అతనికి బైబిలు మీద విశ్వాసం ఉన్నా ఏరకమైన వ్యవస్థీకృత మతం పట్లా నమ్మకం లేదు.

A Poison Tree

I was angry with my friend:
I told my wrath, my wrath did end.
I was angry with my foe:
I told it not, my wrath did grow.

And I watered it in fears,
Night and morning with my tears;
And I sunned it with smiles,
And with soft deceitful wiles.

And it grew both day and night,
Till it bore an apple bright.
And my foe beheld it shine.
And he knew that it was mine,

And into my garden stole
When the night had veiled the pole;
In the morning glad I see
My foe outstretched beneath the tree.

William Blake

%d bloggers like this: