Image Courtesy: http://www.google.co.in
.
Hope
That endless abysmal strains of grief,
Which blossom as clear chrysanthemum of smiles
On the lips of a babe
Hope
That eons-familiar mystic astral-drizzle
that rains unseen at night
On the expansive silent seas of darkness
Hope
Which walks with green grassy step (pie)s
Through the sand storms of Saharan Desert
Hope
That lukewarm bonfire warmth of faggots
Kindled on the solidified icy Arctic seas
Hope
That streak of lightning
like the glittering cardinal rays of rising sun
That kiss the earth on its head
Hope
That comes floating on the chariot
Of wafting cloud currents
Hope
That lilting little cool moonbeam
Advancing on the swing of crescent moon
Hope
That animate primitive dormant dreams in me
Touching my dreamy eyes ethereally like peacock plumes,
Hope
That enduring water-spring amidst the heaps of sandy debris
Annals of destructive degenerate human civilizations
Hope
That pleasant seizure of desire
That showers fragrances of green champak
On the lacerated life
Hope
That warm soothing embrace of a mother
To a wailing kid vanquished in his play
Hope
That inviting tintinnabulation of anklet bells
In the profound silence of
Encircling Aimless culs-de-sac,
Hope
That spec of spark that lights life eternally
Hope
That pulsating life of man who unveiled a supreme wonder
Hope
That din of gallant resistances by the common men
Hope
That Morning Star which kindly leads the way
When the earth under the feet suddenly gives in
,
Hope!
Come ! Settle on my sails of dreams
Becoming a spectral hued butterfly!
.
Vimala
.
సప్తవర్ణాల ఆశ
.
అనంత దుఃఖరాగాల అగాథాల్లోంచి
పసిపాప పెదవులపై పూసిన
చిరునవ్వుల చామంతుల్లా ఆశ
నిరాశామయ చీకటి సముద్రాలపై
రాత్రి రహస్యంగా కురిసే
నక్షత్రాల చిరపరిచిత చిరుజల్లులా ఆశ
సహారా ఎడారుల ఇసుక తుఫాను మధ్య
గరిక పచ్చని మైదానాల పాదాలతో నడిచి వెళ్ళే ఆశ
అంటార్కిటికాలో ఘనీభవించిన మంచు సముద్రాలపై
వెలిగించిన నెగళ్ళ నులివెచ్చని వెచ్చదనం లా ఆశ
భూమి శిరస్సును ముద్దాడే వెలుగు కెరటాల
సూర్యోదయంలా తళుక్కున మెరిసే ఆశ
తెలిమబ్బు కెరటాల తేరుపై ఊరేగుతూ వచ్చే ఆశ
నెలవంక ఊయలపై వెన్నెల్లా చల్లగా ఊగుతూ వచ్చే ఆశ
నెమలి పింఛంలా నా కలల కళ్ళని
సుతారంగా తాకి నిదురించే
అనాది స్వప్నాల్ని మేల్కొలిపే ఆశ
విధ్వంసక మానవేతిహాసాల శిధిల
నాగరికతా ఇసుక మేటల మధ్య ఆరని నీటిచెలమలా ఆశ
క్షతగాత్ర జీవితంపై కురిసే
పున్నాగపూల పరిమళంలా హాయిగా కమ్ముకునే ఆశ
ఆటలో ఓడి ఏడ్చే బిడ్డని ఒడిజేర్చి
ఓదార్చే తల్లిలా ఆశ
దారులన్నీ మూసుకుపోయిన గమ్యరాహిత్యాల
నిరామయ నిశ్శబ్దాల మధ్య
చిరుమువ్వల సవ్వడిలా పిలిచే ఆశ
అనుశృతంగా జీవితాన్ని వెలిగించిన అగ్ని కణంలా ఆశ
మహాద్భుతాన్నావిష్కరించిన మనిషి ప్రాణ స్పందనలా ఆశ
సామాన్యుల సాహసోపేత ప్రతిఘటనల పెనుఘోషలా ఆశ
నమ్ముకున్న నేల పాదాలకింద ముక్కలైనా
వేగుచుక్కయి వెలుగుదారిచూపే ఆశ
ఆశా!
నాకలల తెరచాపపై
సప్తవర్ణాల సీతాకోక చిలుకలా వచ్చి వాలు!
.
విమల
13 జులై ఆంధ్రజ్యోతి 2003
మృగన కవితా సంకలనం నుండి
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…