.
A course through forest.
.
She held him on her shoulders—
And was talking while walking.
He was “ooo-ooo”ing
.
There were footprints in her words
And the words spread across her footprints.
.
She was walking
And was talking while walking.
.
He held her little finger
Getting off her shoulder.
Now they are walking together.
.
They walked
And walked
And walked
Along footpaths
Beside streams
Through the shades
Over dry leaves.
She was talking still.
.
He grew tall like a Deodar
She was bent like the curve of a cove.
.
She sad:
‘Convert all ammunition to implements’
.
As they continued to walk
Fall fell
She said she could walk no longer .
.
Now he held her on his shoulder
And she nestled like a bow.
.
Not sure if she was talking still
But he was hearing her words.
.
He was walking along
Dark nights passed and the day broke suddenly .
It started drizzling.
.
He felt his shoulder with a start.
She wasn’t there
Instead a plough was hanging there.
.
He held it tight with both hands
And marched forward
Taking a momentous turn.
.
Kopparthy.
.
తల్లీ-భూదేవీ
.
అడవి దారి
.
ఆమె వాణ్ణి భుజాన వేసుకుని నడుస్తోంది
నడుస్తో మాటాడుతోంది
వాడు ఉంగాకొడుతున్నాడు
.
ఆమె మాటల్లో పాదముద్రలున్నాయి
ఆమె పాదముద్రల్లో మాటలు పరచుకున్నాయి
.
ఆమె నడుస్తోంది
మాట్లాడుతూ నడుస్తోంది
.
వాడు భుజం దిగి చిటికెనవేలు పట్టుకున్నాడు
ఇద్దరూ నడుస్తున్నారు
.
వాళ్ళు
కాలిబాటల వెంట
సెలయేటిప్రవాహాల వెంబడి
వృక్షఛ్ఛాయల గుండా
ఎండుటాకుల మీదుగా
నడిచారు నడిచారు నడిచారు
ఆమె మాట్లాడుతూనే వుంది
.
అతను దేవదారు వృక్షంలా నిటారుగా పెరిగాడు
ఆమె కొండకొమ్ములా వొంగిపోయింది
.
ఆమె అన్నది
‘ఆయుధాలనన్నిటినీ పనిముట్లుగా మార్చండి’
.
నడకసాగి ఆకురాలు కాలం వచ్చింది
ఇక నడవలేనన్నదామె
.
అతను భుజానికెత్తుకున్నాడు
ఆమె విల్లులా అమరింది
.
ఆమె మాట్లాడుతోందో లేదో తెలీదు
అతనికి మాటలుమాత్రం వినపడుతున్నాయి
.
అతను నడుస్తున్నాడు
చీకటిరాత్రులు గడిచి భళ్ళున తెల్లారింది
చినుకులు మొదలయ్యాయి
.
ఉలిక్కిపడి భుజం తడుముకున్నాడు
ఆమె లేదు
అక్కడొక నాగలి వేలాడుతోంది
.
రెండుచేతుల్తో
బిగించి పట్టుకుని
మలుపు తిరిగి సాగిపోయాడు
.
కొప్పర్తి
10.12.97
విషాద మోహనం కవితా సంకలనం నుండి
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తూంది…