అనువాదలహరి

For A Drop of Rain … Siddhartha

http://www.thehindu.com/multimedia/dynamic/00000/DROUGHT-22_jpg_426f.jpg
Image Courtesy: http://www.thehindu.com

.

Even when the hearts of barren clouds,

Desert feet of inviable seeds

And South-west monsoon song sting us,

we had a history of resistance coping up with.

But the bleeding aborted assurances of rulers’ promises of water

Still, well up in our eyes.

The sides wear out

Weary of keeping watch over the Jowar seeds

Hardening grain by grain.

Farmyard continues to break up dried.

For me, who wept over that one and a half  acre holding

For nights on

Comfort of the Cassia bushes was my only companion.

There were my shadows wherever I looked…

Rain… is my never-to-be-seen grandma

Harvest … is the legendary horse of my mother’s tale

Wolves continue to rake pangs of thirst standing in the barren lands.

My brother who hanged himself…

My child who is pregnant…

And the shadow that pursues me the moment I get out of the hut…

Behind them all steals an intangible death.

And the black bird which appeared over the sky

Committed suicide without drizzling a drop.

Awaiting that eluding rain-drop

At the threshold of my village gathering relics

Stand I

And my holding.

.

Siddhartha.

చినుకై

.

కురవని మేఘాల గుండెలు

మొలవని గింజల ఎడారి పాదాలు

నైరుతి పాట గాయం చేసినా…

తట్టుకున్న పోరాటాలున్నాయి మాకు.

కానీ, మారాజు చేసిన జలవాగ్దానాల

నెత్తుటిస్రావాలు, కళ్ళల్లో పొంగుతూనే వున్నాయి.

బిందు బిందువుగా కురుసే జొన్నవిత్తులకోసం

కన్ను కాసీ కాసీ పక్కటెముకలన్నీ

అరిగిపోతూనే ఉన్నాయి.

కల్లం పగిలిపోతూనే వుంది.

రాత్రుల పర్యంతాలూ ఎకరన్నర చెల్కలో

నిశ్శబ్దంగా రోదించిన నాకు

తంగేడుపొదల వోదార్పే తోడు.

నన్నుపోలిన నీడలే ఎక్కడయినా…

‘ వాన ‘ కనబడని మా నాయనమ్మ

‘ పంట ‘ మాయమ్మ చెప్పిన గుఱ్ఱం కథ

బీళ్ళల్లో తోడేళ్ళు నిలబది దాహాలని ఎగదోస్తూనే వున్నాయి.

ఉరేసుకున్న మా అన్నా…

కడుపుతోవున్న నా బిడ్డా…

గుడిసె దాటంగానే తోడొచ్చే నా నీడా…

వీళ్ళందరి వెనకా ఒక అస్పష్ట మృత్యువు.

ఆకాశంలో కనబడిన నల్లటి పక్షి

చినుకుల్ని విదిలించకుండానే ఆత్మహత్య చేసుకుంది.

రాని చినుకు కోసం మా ఊరి గుమ్మంలో

మూటగట్టిన అవశేషాలతో

నేనూ…

నా భూమి.

.

సిధ్ధార్థ

‘ దీపశిల ‘  కవితా సంకలనం నుండి

%d bloggers like this: