War And Enemy … Kopparthy

.
We crossed the Seas,
We Crossed Deserts,
Crossed Forests and Firmaments
Now, we must cross the Wars.
Swim across the impending calamity of War spread before man.
.
There is but one world
And Only one Man
It’s the existence of the earth
That confers all creation
A state of being.
It’s Man alone
Who glows with life
Like a lamp
On the pinnacle of the world.
But it is War
That prevents the world being the World.
And it is the very War
That throws Man off into the Abysses
From every summit he conquered.
War
Is the fever that the World is afflicted with.
** ** **
The Enemy who trespasses boundaries
Also trespasses the no man’s land
Between civility and barbarism.
Then one has to win
Not only the enemy but also the war.
Like all people of a country
Combine to fight their enemy
People world over should unite
To win over the War now.
They must isolate War along with the enemy.
Like reaching a plateau crossing the forest,
Like entering a garden passing the burial ground
We must enter Peace crossing the War.
Enemy is an abbreviation of War
Win over the Enemy
Conquer the War.
Once there is War, both parties should lose.
The only War that both parties win
Is the War that was never fought.
** ** **
We viewed skies unspanned by vultures
Observed lakes uninfested with crocodiles
Watched Rains showering no thunderbolts
It remains, to see a world without War.
.
Kopparthy (Venkata Ramana Murthy)
1999
.
యుధ్ధమూ – శత్రువూ
.
మనం సముద్రాలు దాటాం
ఎడారులు దాటాం
ఆడవులూ అంతరిక్షమూ దాటాం
ఇక యుధ్ధాన్ని దాటాలి
మనిషిముందు ఉపద్రవమై పరుచుకున్న యుధ్ధాన్ని ఈదాలి.
ఉన్నది ఒకటే ప్రపంచం
ఒకడే మానవుడు
భూమి అస్తిత్వమే
సమస్త విశ్వాన్నీ
ప్రాణసహితం చేస్తున్నది.
మనిషి ఒక్కడే విశ్వశిఖరాగ్రమ్మీద
చైతన్యదీపమై వెలుగుతున్నది
ప్రపంచాన్ని ప్రపంచం కానివ్వకుండా
చేస్తున్నది యుధ్ధమే
అధిరోహించిన ప్రతి శిఖరమ్మీద నుంచీ
మనిషిని అగాధాల్లోకి తోస్తున్నదీ యుధ్ధమే.
యుధ్ధం
ప్రపంచానికి పట్టిన జ్వరం
** ** **
సరిహద్దురేఖల్ని దాటే శత్రువు
నాగరికతకు అనాగరికతకు మధ్యనుండే
అలీనరేఖను దాటుతాడు.
అప్పుడు గెలవాల్సింది శత్రువునే కాదు, యుధ్ధాన్ని కూడా.
ఒక దేశం లో ప్రజలంతా ఏకమై
యుధ్ధాన్ని ఎదుర్కోవాలి
శత్రువుతోపాటు యుధ్ధాన్నీ ఏకాకిని చెయ్యాలి
అడవినిదాటి మైదానాన్ని చేరుకున్నట్టు
శ్మశానాన్ని దాటి పూలతోటలోకి అడుగుపెట్టినట్టు
యుధ్ధాన్ని దాటి శాంతిలోకి ప్రవేశించాలి
యుధ్ధానికి హ్రస్వరూపమే శత్రువు