అనువాదలహరి

For a Catharsis … Kopparthy

http://photo-dict.faqs.org/photofiles/list/290/9097pen.jpg
http://photo-dict.faqs.org/photofiles/list/290/9097pen.jpg


.

Yes

One has  to write

At least to apprehend the quietude

After a prolonged battle.

To assert that man is a tree that can blossom

One must write.

Creation is but a translation of the world…

Creation is destruction in the first place…

As  one  writes

Pen traces plough lines on paper

And the vivacity of life flows from fingers to the letters.

After the writing is completed

The train of sentence whistles off

Hauling bogies of words behind

The sound, however, pervades the surroundings.

.

One has to write…

Write a letter to the world

Answering the Why’s and What’s…

For a synthesis…

For the sake of a catharsis.

One can write on the sky

Write on the ocean

But

Letters can’t be written on the sky

Letter won’t retain on the sea

Therefore

One must write about an idea expansive as the sky

Write about indigence as deep as the sea

Yes, write

That centuries of harassment

Could not shake the confidence about life,

And

That the drops of sweat on the forehead

Efface the writing over there.

And when write, write

Not on cisterns but on cataracts

Not on leaves but on lives

.

Yes, write… and write

Write only in words that shall never dry up.

And the eyes that read them

should absorb the moisture and get moisten’

Must write…  Yes write

One must go on writing for life

Till that timeless sentence suddenly strikes…

And in that enduring writing,

Heart should wear down.

.

Writing and smearing sandal are not akin.

Nobody can stamp out the sense of writing.

6.11.1992

Kopparthy.

.

ఒక కెథార్సిస్ కోసం

 .

ఒకసుదీర్ఘయుధ్ధంతర్వాతపొందేవిశ్రాంతిని

అనుభవించడంకోసమైనా

రాయకతప్పదు.

మనిషీ పుష్పించగలచెట్టేననిచెప్పడంకోసమైనా

రాయాల్సిందే.

సృజనంటే ప్రపంచాన్నిఅనువదించడమే

సృష్టించడమంటే విధ్వంసం చెయ్యడమే

రాసేటప్పుడు

కాగితంమీద కలం నాగేటిచాళ్ళని సృష్టిస్తుంది.

చేతివేళ్ళలోంచి జీవశక్తి అక్షరాల్లోకి ప్రవహిస్తుంది

రాసింతర్వాత

పదాలబోగీలతోవాక్యంరైలుకూతవేసుకుంటూవెళిపోతుంది

ధ్వనిమాత్రం వాతావరణమంతా అలుముకుంటుంది.

రాయాలి

ప్రపంచానికొకఉత్తరంరాయాలి

ఎందుకుకూ, ఏమిటికీజవాబులురాయాలి

ఒకసింథసిస్కోసం

ఒకకెథార్సిస్కోసంరాయాలి

ఆకాశం  మీదరాయొచ్చు

సముద్రంమీదరాయొచ్చు

కానీ

ఆకాశంమీదఅక్షరాలురాయబడవు

సముద్రంమీదరాతలునిలబడవు

అందుకే

ఆకాశంలాంటిఆలోచనమీదరాయాలి

సముద్రంలాంటి దరిద్రంమీదరాయాలి

శతాబ్దాలపీడన

జీవితంపట్ల విశ్వాసాన్ని చెరపలేకపోయిందనీ

నుదిటినపట్టిన చెమటలు

నుదుటిగీతల్నిచెరిపేస్తున్నాయనీరాయాలి

రాయాల్సింది

కోనేటిమీదకాదు, సెలయేటిమీద

కాగితాలమీదకాదు జీవితాలమీద

రాయాలి రాయాలి

రాస్తే తడిఆరని అక్షరాల్నేరాయాలి

చదివినకళ్ళు

తడినిపీల్చుకునిపీల్చుకుని సజలాలవ్వాలి

రాయాలి రాయాలి

ఎప్పుడోవచ్చే ఒక్కశాశ్వతవాక్యం కోసం

జీవితమంతా రాయాలి

రాసీరాసీ గుండెలరిగిపోవాలి

రాయడమూ గంధంరాయడమూ ఒకటికాదు

రాయడాన్నెవరూ కాలరాయ లేరు.

.

కొప్పర్తి

విషాదమోహనంకవితాసంకలనంనుండి

%d bloggers like this: