Is the distance between life and death just a step?
Oh, lady! you who logged all these distances in steps,
How could you fail to put that single step forward?
How did that six-inch rail, tell me,
Had suddenly become a six-foot wall?
How do you know
Who gave you the role of a scare crow ?
Or, Who authored this Bheebhatsa Rasa*?
Whether you had walked, crawled or rolled all your life,
But your last journey was performed at sixty mph.
Who would answer if one questions
Their right to drive trains at speeds
They haven’t yet learnt to bringing them to halt instantly?
*** *** ***
Travel he might at whatever speed
And however long…
Can Man produce one, just one, life-particle?
The fingers that built many great cities,
Skyscrapers,
Machines, Airplanes and Rails
Can create a little finger again?
Is it necessary to reassert that the Man
Who can see, walk, think, and talk
Is a great wonder?
Man may come out of man
Like the Doll Family of Etikoppaka**
One from the other to generations…
But who can create a man out of raw materials?
.
Who can explain what is life?
Who can give life?
*** *** ***
Moon may now be a ball of butter in the palm to man
but
however high man may jump
Heaven is still out of his reach
His image can’t be recreated
And all tools would come to nothing.
Even if one forges all the delicacy of creation at one place
It would still fall short of … one Heart.
No matter how many Roses and China Roses were crushed
Not a drop of blood would come to life.
*** *** ***
Whatever you write about man…. becomes poetry
And it is only Poetry that can equal Life.
It is why, lady!
I made you into a poem
Unable to bring you back to life
.
15.5.1995
Kopparthy
( An Eyewitness account of the death of a middle-aged working-class woman who was killed while crossing a rail line and dragged for twenty miles, and the train entering Nidadavole Station with body hanging in front … )
*Bheebhatsa Rasa, (Repulsive or Disgust) is one of the Nine Rasas or feelings (Emotions) of Man. Any thing that is disgusting or nauseating is Bheebhatsa
** Etikoppaka is a village of Visakhapatnam of Andhra Pradesh, India well-known for its range of Toys, particularly the kind mentioned here, A Family of toys of decreasing sizes one nesting in another … like the Russian Matryoshka Dolls or Babushka Dolls
.
అంతిమ యాత్ర
.
చావుకీ బ్రతుక్కీ మధ్య దూరం ఒక్క అడుగేనా?
దూరాలన్నీ అడుగుల్తోనే గడచినదానివి
ఆ ఒక్క అడుగూ వెయ్యలేకపోయేవా?
ఆరంగుళాలెత్తున్న రైలుపట్టా
అమాంతం ఆరడుగుల అడ్డుగోడ ఎట్లా
అయ్యింది చెప్పు?
దిష్టిబొమ్మ పాత్రనెవరిచ్చారో
ఆ భీభత్సరసపోషణకు దర్శకులెవరో
నీకెలా తెలుస్తుందీ?
జీవితమంతా నడిచావో, పాకావో, దొర్లావో
అంతిమయాత్రమాత్రం అరవైమైళ్ళవేగంతో నడిచింది
హఠాత్తుగా నిలపగల శాస్త్రం
ఇంకాపట్టుబడనప్పుడు
రైలును వేగంగా నడిపే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తే
ఎవరు జవాబిస్తారు?
******
ఎన్ని మైళ్ళవేగంతో
ఎంతకాలం ప్రయాణిస్తే
మనిషి ఒక జీవాణువుని సృష్టించగలడు?
చేతివేళ్ళుకట్టిన ఎన్ని మహానగరాలు
ఆకాశభవనాలు
యంత్రాలు విమానాలు రైళ్ళు
ఒక్క చిటికెనవేలిని మళ్ళీ సృష్టించగలవు?
నడిచి, చూచి, ఆలోచించి, మాట్లాడే మనిషి
అపురూపం అద్భుతం అని మళ్ళీ కొత్తగాచెప్పాల్సి వచ్చిందా
ఏటికొప్పాక బొమ్మలకుటుంబం లో ఉండే
పెద్దబొమ్మలోంచి వచ్చిన చిన్న బొమ్మలాగ
మనిషిలోంచే మనిషి వస్తుంది కానీ
ముడిసరుకుల్తో మనిషినెవరు తయారుచేస్తారు?
ప్రాణం అంటే ఏమిటో ఎవరు చెబుతారు
ఎవరు పోస్తారు?
******
చంద్రుడిపుడు చేతిలో వెన్నముద్దే కావొచ్చు
అయినా
ఎంత పైకెగిరినా స్వర్గం చేజిక్కదు.
బొమ్మ తయారుకాదు.
పనిముట్లన్నీ నిష్ఫలమైపోతాయి.
ప్రపంచంలోని సౌకుమార్యం అంతా పోతపోసినా
ఒక్క హృదయానికి సాటిరాదు.
ఎన్ని గులాబీల్నీ మందారాల్నీ పిండినా
ఒక్క రక్తపుచుక్క జీవం పోసుకోదు.
*******
మనిషిగురించి ఏది రాసినా కవిత్వమే అవుతుంది.
ప్రాణంతో సమానమైంది ఒక్క కవిత్వమే!
అందుకే ప్రాణంపొయ్యలేక – తల్లీ
నిన్ను కవిత్వం చేసాను!
.
(ఈ మధ్య లింక్ ఎక్స్ ప్రెస్ పట్టాలు దాటుతున్న ఒక నడివయస్సు శ్రామిక స్త్రీని ఢీకొని శవం
ఇంజను ముందుభాగంలో వేలాడుతుండగా దాదాపు ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి
నిడదవోలు స్టేషన్ లోకి భీభత్సంగా ప్రవేశించిన దృశ్యానికి ప్రత్యక్ష సాక్షిగా…)