ఓజిమాండియస్ … షెల్లీ

.
నేనొక పురాదేశపుయాత్రికుడిని కలిసేను
అతనన్నాడుగదా: “ఎడారిలో
నేను శిల్పాకృతిలో రెండు మహోన్నతమైన పాదాలు
మొండివి, చూసేను.
దగ్గరలోనే ఇసుకలో సగం కప్పబడి
చెదిరిన శిరస్సుకూడా కనిపించింది.
ఆ ముఖంమీద చిట్లించిన నొసలు,
మడిచిన క్రింది పెదవీ, అపహసిస్తున్న అధికార దర్పమూ,
నిర్జీవమైన ఆ శిలలో ఎంత సజీవంగా
అచ్చుగుద్దినట్టు ప్రతిఫలిస్తున్నాయంటే,
ఆ శిల్పి ఎవరో ఆ వెక్కిరించిన చేతినీ,
ఆవేశపూరితమైన హృదయాన్నీ బాగా చదివేడని తెలుస్తోంది.
అక్కడ పీఠం మీద ఈ మాటలు చెక్కి ఉన్నాయి:
‘నేను రాజాధిరాజు ఓజిమాండియస్ ని.
ఓరీ బలదుర్విదగ్ధులారా! స్వయంకృషితో విస్తరించిన
నా సామ్రాజ్యాన్ని గమనించి, నిట్టూర్చండి.’
.
ఇప్పుడా బృహద్విధ్వంసం చుట్టూ
ఏమీ మిగలలేదు,
కనుచూపుమేరా విస్తరించిన సువిశాల సైకతశ్రోణులు తప్ప.”
.
షెల్లీ
.
Ozymandias
.
I met a traveller from an antique land
Who said: `Two vast and trunkless legs of stone
Stand in the desert. Near them, on the sand,
Half sunk, a shattered visage lies, whose frown,
And wrinkled lip, and sneer of cold command,
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them and the heart that fed.
And on the pedestal these words appear —
“My name is Ozymandias, king of kings:
Look on my works, ye Mighty, and despair!”
Nothing beside remains. Round the decay
Of that colossal wreck, boundless and bare
The lone and level sands stretch far away.’
.
PB Shelly
నేను నిన్ను ప్రేమించాను… అలెగ్జాండర్ పుష్కిన్

.
నేను నిన్ను ప్రేమించాను. బహుశా ప్రేమిస్తున్నానేమో కూడా
ఈ భావన ఇంకా కొంతకాలం కొనసాగుతూనే ఉంటుంది
నా ప్రేమ నిన్నిక ఇబ్బంది పెట్టదులే,
నీకు ఏ రకమైన బాధా కలిగించదలుచుకోలేదు
నిన్ను ప్రేమించాను; అది ఎంత నిరాశావహమైనదో నాకు తెలుసు
ఆ అసూయ, బిడియము నిష్ప్రయోజనమైనప్పటికీ
నా నిజమైన, సుకుమారమైన ప్రేమకు ఆలంబనలయ్యాయి
భగవంతుడు నువ్వు తిరిగి ప్రేమించబడేట్టుగా అనుగ్రహించుగాక!
.
అలెగ్జాండర్ పుష్కిన్
ప్రముఖ రష్యన్ కవి
.
I Loved You
.
I loved you, and I probably still do,
And for a while the feeling may remain…
But let my love no longer trouble you,
I do not wish to cause you any pain.
I loved you; and the hopelessness I knew,
The jealousy, the shyness – though in vain –
Made up a love so tender and so true
As may God grant you to be loved again.
.
Alexander Sergeyevich Pushkin
(6 June 1799 – 10 February 1837)
(From a Translation by Genia Gurarie)
Courtesy: PoemHunter.com
షేక్స్పియర్ … సానెట్ 18

.
నిన్నొక గ్రీష్మోదయముతో సరిపోల్తునా?
కానీ, నువ్వు దానికంటే మనోహరంగా, మితోష్ణంగా ఉంటావు.
మే వడగాడ్పులు కుసుమిస్తున్న లేత మొగ్గల్ని కుదిపేస్తాయి,
అయినా, వేసవి నిడివి అనగా అదెంత ?
ఒకోసారి దినకరుడు మరీ తీక్ష్ణంగా ప్రకాశిస్తాడు,
తరచు అతని స్వర్ణరోచిస్సులు మేఘాఛ్ఛాదనకు గురౌతాయి.
అదిగాక, ప్రతి సౌందర్యమూ, తన సౌందర్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు వీడవలసిందే…
సంభవతవలననో, ప్రకృతిపరివర్తనవల్లనో… మరి చక్కబడదు.
కానీ, నీ వాయని వెచ్చదనం శాశ్వతం.
ఇసుమంతైనా వాడని సౌందర్యం నీ సొత్తు.
అనశ్వరమైన ఈ పంక్తుల్లో నువ్వు కాలంతోపాటు చిరంజీవిగా ఎదిగినపుడు
మృత్యువు నువ్వు తనవశమని డంబాలు పలకలేదు
మనిషికి ఉసురున్నంతవరకూ, కనులు దర్శించగల్గినంతవరకూ
ఈ కవిత జీవించి ఉంటుంది… అది నీకు అమరత్వాన్ని కలిగిస్తుంది.
.
షేక్స్పియర్
.
Shall I compare thee to a summer’s day?
Thou art more lovely and more temperate.
Rough winds do shake the darling buds of May,
And summer’s lease hath all too short a date.
Sometime too hot the eye of heaven shines,
And often is his gold complexion dimmed;
And every fair from fair sometime declines,
By chance, or nature’s changing course, untrimmed;
But thy eternal summer shall not fade,
Nor lose possession of that fair thou ow’st,
Nor shall death brag thou wand’rest in his shade,
When in eternal lines to Time thou grow’st.
So long as men can breathe, or eyes can see,
So long lives this, and this gives life to thee.
.
Shakespeare
Sonnet XVIII
నా సమాధి దగ్గర ఏడవకు – మేరీ ఎలిజబెత్ ఫ్రై
.
నా సమాధి దగ్గర నిలబడి ఏడవకు
నే నక్కడ లేను. నేను నిద్రించను
.
నేనిపుడు శతసహస్ర పరీమళ పవనప్రసారాన్ని
నేనిపుడు హిమోధ్భూత వజ్రసదృశ ప్రతిఫలాన్ని
.
ఈడేరిన వరికంకులమీది వెలుగురేని లే కావి కిరణాన్ని నేను,
ఆకాసంనుండి మంద్రంగా జాలువారే వర్షాకాలపు చిరుజల్లుని నేను
.
ప్రాభాత నీరవప్రశాంతతలో నువు కనుదెరిచినపుడు
సడిసేయక వడి ఎగిరే
ఆవృత్త ద్విజసమూహాన్ని నేను
నిశాతమస్సులో అల్లన మెరిసే మృదుతారానివహాన్ని నేను
.
నా సమాధి ప్రక్కన నిలబడి ఏడవకు
నే నక్కడ లేను. నేను మరణించలేదు
.
మేరీ ఎలిజబెత్ ఫ్రై
1932లో బాల్టిమోర్(అమెరికా)లో రాయబడి ఒక 66 సంవత్సరాలపాటు బహుళప్రచారంలో ఉన్నప్పటికీ రచయిత పేరు తెలియని 6 Couplets (ద్విపదలు) లో కనిపించే ఈ కవితకి ఘనమైన చరిత్ర ఉంది. మేరీఫ్రై అంతకుముందెప్పుడూ కవిత్వం రాయలేదు. Margaret Schwarzkopf అనే జర్మను జ్యూయిష్ వనిత నాజీలభయంకారణంగా తనతల్లి అవసానదశలో ప్రక్కనలేకపోయినందుకు విలపిస్తున్నప్పుడు, గోధుమరంగు Shopping Bag మీద మేరీ ఎలిజబెత్ ఫ్రై వ్రాసిన కవిత ఇది. తర్వాత ఆమె ఎన్ని కవితలు వ్రాసినప్పటికీ, ఇదొక్కటే చిరస్థాయిగా నిలిచిపోయింది. సార్వజనీనికమైన సత్యాన్ని ఆవిష్కరించే ఈ కవిత, 1995లో Englandలో జాతీయస్థాయిలో బహుళప్రచారం గల కవితగా ఎన్నికైంది. దీనికి ఎన్నో అనుకరణలు వచ్చాయి. సంగీతబధ్ధం చెయ్యబడింది. అనేక భాషలలోకి అనువాదం చెయ్యబడింది కూడా. ఎన్నో Funeral announcementsలో ఇది చదువబడ్దది
.
Do Not Stand at my Grave and Weep
.
Do not stand at my grave and weep
I am not there. I do not sleep
.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow
.
I am the sunlight on ripened grain
I am the gentle autumn rain
.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
.
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night
.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.
.
Mary Elizabeth Frye
American Poet
To read some interesting info about the poet pl. visit: http://www.thehypertexts.com/Mary%20Elizabeth%20Frye%20Poet%20Poetry%20Picture%20Bio.htm
దూరం గా తొలగిపోకు… పాబ్లో నెరూడా
దూరంగా తొలగి పోకు, ఒక్క రోజుకైనా సరే! ఎందుకంటే…
ఎందుకంటే… నాకెలాచెప్పాలో తెలియడం లేదు, రోజంటే… చాలా సమయం.
ట్రైన్లన్నిట్నీ ఎక్కడో యార్డ్ లో విశ్రాంతికి తీసుకుపోతే,
ఖాళీ ప్లాట్ ఫారం మీద వాటికోసం నిరీక్షించినట్టు, నేను నీకోసం నిరీక్షిస్తుంటాను
.
నన్ను ఒక గంటసేపైనా విడిచిపెట్ట వద్దు. ఎందుకంటే,
నా పరివేదనా బిందువులు ఒక్కొక్కటీ కలిసి ప్రవాహమౌతాయి,
గూడుకై దిమ్మరిగా తిరిగే పొగ, అలా దారితప్పి తేలియాడుతూ
నాగుండెల్లోకి జొరబడి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది
.
ఓహ్, కడలితీరాన నీ ఊహాచిత్రము చెదిరిపోకుండుగాక!
నీ కన్రెప్పలు సుదూర శూన్యంలోకి చూస్తూ అల్లాడకుండుగాక!
ప్రియతమా! నన్ను ఒక క్షణం కూడా విడువకు!
ఎందుకంటే, ఆ క్షణం లో నువ్వు ఎంతో దూరం వెళ్ళిపోయి ఉంటావు
నేను చిక్కుల్లో చిక్కుకుని, వెనుదిరిగి రావా?
నన్నిలా మరణించమని విడిచిపెట్టి వెళిపోతావా?
అని అడుగుతూ, భూమంతా గాలిస్తూ ఉంటాను.
.
పాబ్లో నెరూడా
.
Don’t Go Far Off
.
Don’t go far off, not even for a day, because —
because — I don’t know how to say it: a day is long
and I will be waiting for you, as in an empty station
when the trains are parked off somewhere else, asleep.
.
Don’t leave me, even for an hour, because
then the little drops of anguish will all run together,
the smoke that roams looking for a home will drift
into me, choking my lost heart.
.
Oh, may your silhouette never dissolve on the beach;
may your eyelids never flutter into the empty distance.
Don’t leave me for a second, my dearest,
because in that moment you’ll have gone so far
I’ll wander mazily over all the earth, asking,
Will you come back? Will you leave me here, dying?
.
Pablo Neruda
అజేయ … విలియం ఎర్న్ స్ట్ హెన్లీ


నా బ్లాగు సందర్శకులకందరికీ
దీపావళి శుభాకాంక్షలు
.
భూ నభోంతరాలు వ్యాపించిన కాలబిలంలా
నన్ను కమ్ముకున్న ఈ నిశీధినుండి,
ఎక్కడెక్కడ ఏ ఏ దేవతలున్నారో వారందరికి నా కృతజ్ఞతలు
లొంగదీసుకోలేని ఆత్మ నాకున్నందుకు
.
పరిస్థితుల పళ్ళచక్రం పట్టి బిగించినా
బాధతో మూలగనూలేదు, వెనుకంజవెయ్యనూలేదు.
యాదృఛ్ఛిక సంఘటనల గాయాలకి
తల రక్తసిక్తమైంది గాని అవనతం కాలేదు
.
ఈ క్రోధాలూ కన్నీళ్ళ సీమ కావల
కనిపిస్తున్నది కేవలం మృత్యుఛ్ఛాయ
ఐనా, వత్సరాల బెదిరింపుల పిదప, భయాలు
నేను లొంగలేదనీ, ఇకమీదటకూడా లొంగననీ గుర్తిస్తాయి
.
ఇపుడు ద్వారం ఎంత తిన్నగా* ఉన్నా,
నేరాల చిఠ్ఠా ఎంత పొడుగుగా ఉన్నా విచారం లేదు.
నా భవిష్యత్తుకిపుడు నేనే విధాతని
నా ఆత్మకు నేనే కర్తని.
.
(* స్వర్గానికి ద్వారం ఇరుకుగానూ, నరకానికి ద్వారం విశాలం గానూ ఉంటుందని Christian Religious thought. Matthew 7:14)
.
విలియం ఎర్న్ స్ట్ హెన్లీ
(23 August 1849 – 11 July 1903)
Victorian Poet
ఒక్క పద్యంతో సాహిత్యంలో శాశ్వతంగా నిలబడగల కీర్తిని సంపాదించడం అరుదు. అటువంటి ఘనత సాధించిన వాడు William Ernest Henley.
ఈ పద్యం నేపధ్యం తెలిస్తే ఇంకా ఆనందించగలం. ఎముకలకు సోకిన క్షయవ్యాధికి అతని ప్రాణం కాపాడటానికి తప్పనిసరి అయి, తన 17వ ఏట ఒక కాలు తొలగించిన సందర్భంలో ఆసుపత్రిలో రాసిన గీతం ఇది. అతను దీనికి శీర్షిక ఉంచలేదు. Arthur Thomas Quiller-Couch, తన సంపాదకత్వంలో 1902లో వెలువడిన “The Oxford Book of English Verse, 1250–1900” పుస్తకంలో దీనికి Invictus అన్న శీర్షిక ఉంచేడు. లాటిన్లో ఈ పదానికి అర్థం “ఓటమి లేని/ ఎరుగని” అని అర్థం.
ఈ పద్యం లో పాదాలు విభిన్న సందర్భాలలో వ్యక్తులకి ప్రేరణ నివ్వడమే గాక, తరచు ఉటంకించడానికి ఉపయోగపడ్డాయి. అందులో ప్రముఖులు, నోబెలు శాంతి పురస్కార గ్రహీతలు … Aung San Suu Kyi (Burma), Nelson Mandela (South Africa) కూడా ఉన్నారు.
2005 జులై 7న టెర్రరిస్టులు లండన్ భూగర్భరైలుమార్గంలో బాంబుదాడి జరిపినప్పుడు, మరుసటిరోజు Daily Mirror పత్రిక ఉంచిన పతాక శీర్షిక “Bloody, but unbowed.”
అతని మిత్రుడు RL Stevenson తన Treasure Island నవలలో Long John Silver పాత్రని హెన్లీ వ్యక్తిత్వం ఆధారం గా రూపకల్పన చేశినట్టు ప్రకటించేడుకూడా.
.
Invictus
.
Out of the night that covers me,
Black as the Pit from pole to pole,
I thank whatever gods may be
For my unconquerable soul.
In the fell clutch of circumstance
I have not winced nor cried aloud.
Under the bludgeonings of chance
My head is bloody, but unbowed.
Beyond this place of wrath and tears
Looms but the Horror of the shade,
And yet the menace of the years
Finds, and shall find, me unafraid.
It matters not how strait the gate,
How charged with punishments the scroll.
I am the master of my fate:
I am the captain of my soul.
.
William Ernest Henley
నిప్పూ-నీరూ… రాబర్ట్ ఫ్రాస్ట్


.
కొందరు యుగాంతం సౌరాగ్నికీలల్లో జరుగుతుందంటారు.
కొందరు, హిమయుగము పునరావృతమవడం వలననంటారు
కాంక్షాపరితప్తానుభవమున్న నేను, అగ్నికీలలనే సమర్థిస్తాను.
కానీ, నాకు పునర్మరణమంటూ ఉంటే,
నాకు ద్వేషం గురించి తగినంత అవగాహన ఉండడం వలన,
వినాశానికి మంచుకూడా గొప్పదని చెప్పడంతో పాటు,
అది సమర్థవంతమైనది అని కూడా చెప్పగలను
.
రాబర్ట్ ఫ్రాస్ట్
.
Fire And Ice
.
Some say the world will end in fire,
Some say in ice.
From what I’ve tasted of desire
I hold with those who favor fire.
But if it had to perish twice,
I think I know enough of hate
To say that for destruction ice
Is also great
And would suffice
.
Robert Frost
అయితే … రుడ్ యార్డ్ కిప్లింగ్

.
నీ చుట్టూ ఉన్నవారు విచక్షణకోల్పోయి నిన్ను నిందిస్తున్నప్పటికీ,
నీ సంయమనం కోల్పోకుండ నిగ్రహించుకోగలిగినట్టయితే,
ప్రతిఒక్కరూ నీ సామర్ధ్యాన్ని శంకిస్తున్నపుడు,
నీ మీద నువ్వు నమ్మకం కోల్పోకుండా,
వాళ్ళ అంచనాలకుకూడా కొంత ఆస్కారంలేకపోలేదు అని అనుకోగలిగినట్టయితే
తగిన అవకాశం కోసం నిరీక్షించగలిగి,
నిరీక్షించడానికి విసుగుచెందకుండా ఉండగలిగినట్టయితే
లేదా, నీ గురించి ఒకరు అబద్ధం చెప్పినపుడు,
నువ్వు తిరిగి అబధ్ధాలతోనే ఎదుర్కోడానికి పూనుకోకుండా ఉన్నట్టయితే
లేదా, నిన్ను ద్వేషిస్తున్నపుడు, నువ్వు తిరిగి ద్వేషించకుండా,
అతి మంచిగా ఉండడం గాని, అతితెలివిగా మాటాడడం గాని చెయ్యనట్టయితే;
.
నువ్వు స్వాప్నికుడవయినా, కలలకు బానిసకాకుండా ఉండగలిగినట్టయితే
నువ్వు ఆలోచించగలిగి, ఆలోచనే నీ లక్ష్యం చేసుకోకుండా ఉన్నట్టయితే
విజయలక్ష్మినీ, పరాజయాన్నీ దీటుగా ఎదుర్కొని,
ఆ ఇద్దరు మాయలాడిల్నీ ఒకే తీరుగా భావించగలిగినట్టయితే
నువ్వు చెప్పిన సత్యాన్ని మూర్ఖుల్ని బోల్తాకొట్టించడానికి
వక్రం గావ్యాఖ్యానించినప్పటికీ, విని సహించగలిగినట్టయితే
నీ జీవితాన్ని ధారపోసి నువ్వు సృష్టించిన వస్తువుల్ని పరులు నీ కళ్లముందే ఛిద్రం చేసినపుడు,
ఒదిగి ఉండి, అరిగిపోయిన పనిముట్లతొనే తిరిగి పునర్నిర్మించగలిగినట్టయితే;
.
నీ సంపాదననంతా కుప్పపోసి, ఒక పాచిక వేతకే ఒడ్డి, పోగొట్టుకుని,
పునః ప్రయత్నం చేసి, నీ నష్టం గురించి ఎవరికీ చెప్పుకోకుండా ఉండగలిగినట్టయితే
నీ శక్తులన్నీ ఉడిగి, నీ కోరికా, నీ బలమూ, సామర్ధ్యమూ, ఎప్పుడో నిన్ను విడిచినప్పటికీ,
కేవలం మనోబలం తోటే వాటిని శాసించి నీకు ఊడిగం చేయించుకోగలిగినట్టయితే;
.
మందతో మాటాడుతున్నప్పటికీ, నీ విలువ నువ్వు కాపాడుకోగలిగినట్టయితే
మహరాజులతో మసలుతున్నప్పటికీ, సామాన్యులతో అనుబంధం తెంచుకోకున్నట్టయితే
నిన్ను శత్రువులూ, ఆప్తమిత్రులూ నొప్పించలేనట్టయితే,
అందరు వ్యక్తులనూ మన్నించినప్పటికీ, ఎవరినీ మిక్కిలిగా పరిగణించనట్టయితే
నిర్దాక్షిణ్యంగా జారిపోయే నిమేష కాలాన్నీ,
అరవై సెకనుల జీవన గమనంతో భర్తీ చెయ్యగలిగినట్టయితే
బిడ్డా! ఈ ప్రపంచం, అందులోని ప్రతి వస్తువూ నీదే!
అంతే కాదు, నువ్వు “మనీషి” వవుతావు
.
రుడ్ యార్డ్ కిప్లింగ్
30 December 1865 – 18 January 1936
.
(కవి, కథారచయిత, నవలాకారుడూ, జర్నలిస్టు, 1907 వ సంవత్సరానికి సాహిత్యం లో నోబెలు పురస్కార
గ్రహీత అయిన రుడ్ యార్డ్ కిప్లింగ్ బొంబాయిలో జన్మించి 6 ఏళ్ళ వరకూ బాల్యం అక్కడే గడిపాడు. అతని
ప్రముఖమైన రచనలు… పిల్లల కథల పుస్తకం జంగిల్ బుక్ (Jungle Book), Kim నవల, కవితల్లో ముఖ్యంగా
“IF” అన్న ఈ కవిత.)
.
If
.
If you can keep your head when all about you
Are losing theirs and blaming it on you;
If you can trust yourself when all men doubt you,
But make allowance for their doubting too:
If you can wait and not be tired by waiting,
Or, being lied about, don’t deal in lies,
Or being hated don’t give way to hating,
And yet don’t look too good, nor talk too wise;
If you can dream—and not make dreams your master;
If you can think—and not make thoughts your aim,
If you can meet with Triumph and Disaster
And treat those two impostors just the same:.
If you can bear to hear the truth you’ve spoken
Twisted by knaves to make a trap for fools,
Or watch the things you gave your life to, broken,
And stoop and build’em up with worn-out tools;
If you can make one heap of all your winnings
And risk it on one turn of pitch-and-toss,
And lose, and start again at your beginnings,
And never breathe a word about your loss:
If you can force your heart and nerve and sinew
To serve your turn long after they are gone,
And so hold on when there is nothing in you
Except the Will which says to them: “Hold on!”
If you can talk with crowds and keep your virtue,
Or walk with Kings—nor lose the common touch,
If neither foes nor loving friends can hurt you,
If all men count with you, but none too much:
If you can fill the unforgiving minute
With sixty seconds’ worth of distance run,
Yours is the Earth and everything that’s in it,
And—which is more—you’ll be a Man, my son!
.
Rudyard Kipling
30 December 1865 – 18 January 1936
If you are inspired by this poem and want to do further the spirit of the poem you may contact :
ఒక కల మరణించింది …డొరతీ పార్కర్

.
ఇక్కడ ఒక కల దీర్ఘనిద్రలో ఉంది.
దయచేసి మీరు చూపులు అటువైపు మరల్చి
ఇక్కడనుండి నెమ్మదిగా కదలండి.
జీవితంకోసం పోరాడి అలసిపోయిన తర్వాత
ఎలా ఉందో చూడటానికి ప్రయత్నించకండి.
దుఃఖంతో నడవొద్దు
కాని కాసేపు, మీ అడుగులు నెమ్మదిగా పడినా ఫర్వాలేదు.
ఇక మీ దయార్ద్రమైన పరామర్శల విషయానికొస్తే,
కాలమే గాయం నయం చేస్తుందనీ,
మంచిరోజులు ముందున్నాయనీ
మొదలైన తియ్యని మాటలు చెప్పకండి.
సత్యం ఏమిటంటే ఇక్కడ ఒక కల మరణించి ఉంది.
అది అందరూ గుర్తుంచుకోవలసిన విషయం;
ఒక అందమైన పువ్వు
గాలికి ఊగి చెట్టునుండి రాలిపోయినపుడు,
చెట్టు ఎప్పటిలాగే పూలుపూచి,
ఫలవంతమవడానికి ఎదురు చూస్తూ ఉండొచ్చు,
కానీ,
అందులో ఈ చిట్టి సౌందర్యపు వెలితి ఉంటుంది.
అందుకు అసంపూర్ణమైన ఆ అందం తలవంచక తప్పదు.
ఎందుకంటే,
ఒక కల దుఃఖప్రదమైన మృత్యువును చేరుకుంది కాబట్టి!
.
డొరతీ పార్కర్ (August 22, 1893 – June 7, 1967)
.
A Dream Lies Dead
.
A dream lies dead here. May you softly go
Before this place, and turn away your eyes,
Nor seek to know the look of that which dies
Importuning Life for life. Walk not in woe,
But, for a little, let your step be slow.
And, of your mercy, be not sweetly wise
With words of hope and Spring and tenderer skies.
A dream lies dead; and this all mourners know:
Whenever one drifted petal leaves the tree-
Though white of bloom as it had been before
And proudly waitful of fecundity
One little loveliness can be no more;
And so must Beauty bow her imperfect head
Because a dream has joined the wistful dead!
.
Dorothy Parker
(August 22, 1893 – June 7, 1967)
American Poet
A Smile On Migration— Y. Mukunda Rama Rao
.

When my own bustling beaut blossom
Bids me good-bye
It seems as though the dove
That huddled close to my heart this long
Has Taken wing
Throwing a misty screen fore eyes
Knowing fully well
like a Siberian bird on migration.
…
That she has packed up all festivities and frolic with her
So soon, makes us think we don’t exist amidst people.
It is not until one comes tete-a-tete with it
No pang or pain would ever be understood!
…
Those capering leaps
Childhood sand dunes and
Captivating mischief, adorning the house still,
Reminds everybody of her.
There are no wakes of her taking off
Except the agony of not finding her here.
…
Even you and I won’t leave out
All plants that shoot up … at one place
Nor leave all fruits to the branches that bore them.
The paroxysm of partition
Does not touch the hands that part.
Else, notice the hand
Not sure if it be a sure hand or not
Like the pride of the victorious over the vanquished
Holding her hand, he sports a glittering smile
Exactly like me… some time during the past.
.
Telugu Original:
వలస పోయిన మంద హాసం
Yellapu Mukunda Rama Rao
