అనువాదలహరి

అజ్ఞాత సమాధి … H.W. లాంగ్ ఫెలో

http://www.hmdb.org/PhotoFullSize.asp?PhotoID=54620
Image Courtesy: http://www.hmdb.org

.

దేశ సైనిక పటాలం నుండి విడుదలచేయబడిన సిపాయి

………………………………………..

అని మాత్రం రాసి ఉంది ఒక సమాధి మీద

న్యూపోర్ట్ న్యూస్  సముద్రతీరపు ఉప్పునీటి కెరటాలకి  సమీపంలో

పేరుగాని, తేదీగాని లేకుండా.

ఒక చిన్న పోరాటంలోనో

లేక, భీకర సంగ్రామం లోనో

తమ దుర్గం మీద జరిగిన ముట్టడిలో

శత్రుఫిరంగులు వర్షించిన గుళ్ళు

ముందువరుసలోని సాహసికులలోనుండి  

దూసుకుపోయి నపుడు విధివశాత్తూ తుడిచిపెట్టుకుపోయిన

పటాలాలలోని నేలకొరిగిన గూఢచారో, పారావాడో;

 

కడలిపక్కన విస్మృత సమాధిలో 

విశ్రమిస్తున్న అజ్ఞాత వీరుడా!

నీ సర్వస్వాన్నీ నా కోసం త్యాగం చేశావు 

నీ జీవితం, నీ పేరు

కానీ, తిరిగి నీకు నేనేమీ ఇవ్వలేనని గుర్తొచ్చినపుడల్లా

 నా గుండె చెప్పుకోలేని అవమానంతో కొట్టుకుంటోంది,

నా నుదురు జ్వలిస్తోంది.

.

H.W. లాంగ్ ఫెలో (February 27, 1807 – March 24, 1882).

.

A Nameless Grave 

 .

‘A soldier of the Union mustered out,’

 Is the inscription on an unknown grave

 At Newport News, beside the salt-sea wave,

 Nameless and dateless; sentinel or scout

 Shot down in skirmish, or disastrous rout

 Of battle, when the loud artillery drave

 Its iron wedges through the ranks of brave

 And doomed battalions, storming the redoubt.

 Thou unknown hero sleeping by the sea

 In thy forgotten grave! with secret shame

 I feel my pulses beat, my forehead burn,

 When I remember thou hast given for me

 All that thou hadst, thy life, thy very name,

 And I can give thee nothing in return.

.

H W Longfellow (February 27, 1807 – March 24, 1882).

%d bloggers like this: