అనువాదలహరి

ఓ ప్రేమా! దయచేసి నాకు నిజం చెప్పు… మికేలేంజెలో

http://t1.gstatic.com/images?q=tbn:ANd9GcQlB4KcVbqERznlLjKJdE2NWO3oa7uEtjb6AQTl-7hs3btt5oJLew
Image Courtesy: http://t1.gstatic.com

.

“ఓ ప్రేమా! దయచేసి నాకు నిజం చెప్పు.

నేనూహిస్తున్న సత్య సౌందర్యాన్ని

నా కనులతో దర్శిస్తున్నానా?

లేక నిజంగా ఈ శిల్పాలలో 

అంతర్లీనంగా ఆ సౌందర్యం ఉందా?

ఎందుకంటే, నేనెటు పరికించినా

ఆమె ముఖారవిందమే కనిపిస్తోంది.

నీకు తప్పకుండా తెలుస్తుంది… 

నా ప్రశాంతతని హరించడానికీ… నన్ను దహించివెయ్యడానికీ

నువ్వామెను అనుసరించి వస్తావు గనుక…

అయినా,  నేను తక్కువ బాధనాశించను…

అంతకంటే  శీతల వహ్నిని కోరుకోను.”

.

“నిజంగా నువ్వు దర్శిస్తున్న సౌందర్యం ఆమెదే!

కాని, చర్మచక్షువులలోనుండి ఆత్మలోకి ఇంకిపోతూ…

అది లోతుకెళుతున్న కొద్దీ ప్రవర్థమానమౌతుంది…

అక్కడ అది తనలాగే పవిత్రమూ, మనోహరమూ  అయి

దైవత్వాన్ని అమరత్వాన్ని  సంతరించుకుంటుంది.

ఆ అందమే నీ కనులముందు ఆవిష్కారమౌతున్నది.”

.

మికేలేంజెలో

(6 March 1475 – 18 February 1564)

ఇటాలియన్ రినైజాన్సు కవి, శిల్పి, చిత్రకారుడు.

(16వ శతాబ్దపు అత్య్తుత్తమ కళాకారుడు మికేలేంజెలో. పాశ్చాత్య చిత్రకళలో ప్రముఖం గా పేర్కొనదగ్గ అత్యంత సుందరమైన రెండు వర్ణచిత్రాలను…  రోం నగరం లోని పోప్ అధికార నివాసమైన సిస్టైన్ ఛాపెల్ లోని లోకప్పుమీద Genesis నుండి కొన్నిదృశ్యాలూ,  Altar గోడపై The Last Judgement …  గీసిన ప్రతిభాశాలి.  ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తడి ఆరిపోకుండా నీటిలో కరిగేరంగులతో వర్ణచిత్రాలు గీయడమే (Fresco Painting)  అక్కడి ప్రత్యేకత.)


.

Love, tell me please, if it’s with my eyes

I see that beauty’s truth, that I aspire to,

Or if it is within, since everywhere I gaze

I see that countenance of hers, sculpted.

You must know, you, who come with her,

To rob me of my peace, at which I blaze:

Though I’d not wish one sigh the less,

Nor would I demand a cooler fire.

.

‘Indeed the beauty that you see is hers,

But grows in passing to a deeper place,

Sinking through mortal eyes to the soul.

There it is made pure, lovely and divine,

Like itself as the immortal part wishes.

That is the beauty set before your eyes.’

.

Michelangelo Buonarroti (1475-1564)

( From A Translation by A. S. Kline)

%d bloggers like this: