పుస్తకం … ఎమిలీ డికిన్సన్

http://t0.gstatic.com/images?q=tbn:ANd9GcR1swPvB2dA2v2ZsI-ReeHGeXkLoUefa-2Y5o4ASPu9CwkR1sgucg
Image Courtesy : http://t0.gstatic.com

.

మనల్ని అపూర్వ తీరాలకు తీసుకెళ్ళడానికి

పుస్తకాన్ని మించిన నౌక లేదు.

పద్యకావ్యాన్ని* పోలిన,  మనోవేగంతో 

దూకుతూ పరుగులిడే జవనాశ్వమూ ఉండదు.

ఈ ప్రయాణం సుదీర్ఘమై ఉండొచ్చు

అయితేనేం! ఇందులో హింస, పీడన ఉండవు.

మానవాత్మను మోసుకుపోయే రధము

ఎంత పోడిమి గలది!

.

* ఇక్కడ పద్యకావ్యం (A Page of Poetry)  అన్నమాట కవిత్వం మొత్తానికి పర్యాయపదంగా వాడబడింది తప్ప కవిత్వం లో ఒక్క పద్య విభాగానికి సూచనగా కాదు అని గమనించ మనవి…

ఎమిలీ డికిన్సన్ (December 10, 1830 – May 15, 1886)

( అమెరికన్ సాహిత్యం లో ఇప్పుడు ప్రధమశ్రేణిలో లెక్కింపబడుతున్న కవయిత్రి ఎమిలీ డికిన్సన్.  ఆమె జీవిత కాలం లో 10-15 కవితలకు మించి ప్రచిరించబడ లేదు. ఆమె 18 వందలకు పైబడి కవితలు వ్రాసిందన్న విషయం ఆమె మరణించేదాకా ఇంట్లో వాళ్లకు కూడా తెలియదు. ఆమె పూర్తిగా  అంతర్ముఖమైన కవయిత్రి.  20వ శతాబ్దం ఉత్తరభాగం వరకూ ఆమె కవిత్వం మీద సరియైన అంచనాలు (తులనాత్మక విమర్శలు) రాకపోయినా, సాహిత్యలోకం ఇప్పుడామె ప్రతిభను  గుర్తిస్తోంది. )

.

A BOOK

There is no frigate like a book

To take us lands away,

Nor any coursers like a page

Of prancing poetry.

This traverse may the poorest take

Without oppress of toll;

How frugal is the chariot

That bears a human soul!

.

Emily Dickinson

“పుస్తకం … ఎమిలీ డికిన్సన్” కి 2 స్పందనలు

    1. Thank you for visiting my blog and for your encouraging comment.

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: