రోజు: సెప్టెంబర్ 13, 2011
-
పుస్తకం … ఎమిలీ డికిన్సన్
. మనల్ని అపూర్వ తీరాలకు తీసుకెళ్ళడానికి పుస్తకాన్ని మించిన నౌక లేదు. పద్యకావ్యాన్ని* పోలిన, మనోవేగంతో దూకుతూ పరుగులిడే జవనాశ్వమూ ఉండదు. ఈ ప్రయాణం సుదీర్ఘమై ఉండొచ్చు అయితేనేం! ఇందులో హింస, పీడన ఉండవు. మానవాత్మను మోసుకుపోయే రధము ఎంత పోడిమి గలది! . * ఇక్కడ పద్యకావ్యం (A Page of Poetry) అన్నమాట కవిత్వం మొత్తానికి పర్యాయపదంగా వాడబడింది తప్ప కవిత్వం లో ఒక్క పద్య విభాగానికి సూచనగా కాదు అని గమనించ మనవి……