రోజు: సెప్టెంబర్ 10, 2011
-
ప్రపంచమొక నాటక రంగం — షేక్స్పియర్
. ప్రపంచమొక నాటక రంగం స్త్రీ పురుషులందరూ కేవల పాత్ర ధారులు. ఎవరి ప్రవేశ నిష్క్రమణలు వారివి తనజీవిత కాలంలో మనిషి బహుపాత్రాభినయం చేస్తాడు అతని ఏడు దశలూ ఏడు అంకాలు. . మొదటిదశ శైశవం దాది చేతుల్లో పసికూనై మూలుగుతూ, కక్కుకుంటూ . తర్వాతదశ బడికి మారాం చేసే పిల్లాడు… ఉదయాన్నే కళకళలాడే ముఖంతో, సంచి భుజాన్నేసుకుని నత్తలా కాళ్ళీడ్చుకుంటూ అయిష్టంగా బడికి కదులుతూ… . తర్వాతదశ ప్రేమికుడు కొలిమిలా వేడి ఊర్పులు విడుస్తూ, ప్రేయసి …