అనువాదలహరి

నేనున్నాను … జాన్ క్లేర్

See Video: I Am — By John Clare.

.

నేనున్నాను.

కానీ నేనెవరో, ఏమిటో

ఎవరికీ తెలీదు… లక్ష్యపెట్టరు.  

నా మిత్రులు నన్నొక  స్మృతిపథంలోలేని విషయంలా వదిలేస్తారు.

నా బాధలు నేనే అనుభవిస్తున్నాను.

అవి గుంపులు గుంపులుగా ఎగసిపడి మాయమవుతుంటాయి

ప్రేమ ఛాయలు మృత్యువులో మరణించినట్టు…

అయినా నేనున్నాను.

కోలాహలం, అలక్ష్యాల  శూన్యం లోకి

పగటికలల చైతన్య సముద్రం లోకి,

నీడలతో బాటు విసిరివేయబడినప్పటికీ,  బ్రతికే! 

అక్కడ బ్రతుకు పట్ల స్పృహ గాని,

హర్షాతిరేకాలుగాని ఉండవు,

జీవన మూల్యాల నౌకాభంగాలు తప్ప.

అత్యంత ఆత్మీయమైనవే—

నేను అపురూపమైన వాటినే ప్రేమించాను—

అయినా అవి పరాయివైపోతాయి…

కాదు కాదు… మిగతావాటికంటే వింతగా కనిపిస్తాయి  

.

నేను మనిషి మున్నెన్నడూ అడుగిడని దృశ్యాలు  అపేక్షిస్తున్నాను…

ఎన్నడూ స్త్రీలు  శోకించనీ,  హసించనీ ప్రదేశాలు కోరుకుంటాను…

అక్కడ నా సృష్టికర్తతో  సహజీవనం చెయ్యడానికి…

నా బాల్యంలో నిద్రించినంత సుఖంగా  ఆదమరచి నిద్రించడానికి…

ఒకర్ని బాధపెట్టకుండా, నేను బాధపడకుండా మేను వాల్చడానికి…

క్రింద పచ్చికా— మీద వంగిన ఆకాశమూ ఉండేలా.

.

జాన్ క్లేర్

.

I Am!

.

I am! yet what I am none cares or knows,

My friends forsake me like a memory lost;

I am the self-consumer of my woes,

They rise and vanish in oblivious host,

Like shades in love and death’s oblivion lost;

And yet I am! and live with shadows tost

Into the nothingness of scorn and noise,

Into the living sea of waking dreams,

Where there is neither sense of life nor joys,

But the vast shipwreck of my life’s esteems;

And e’en the dearest—that I loved the best—

Are strange—nay, rather stranger than the rest.

I long for scenes where man has never trod;

A place where woman never smil’d or wept;

There to abide with my creator, God,

And sleep as I in childhood sweetly slept:

Untroubling and untroubled where I lie;

The grass below—above the vaulted sky.

.

John Clare

(13 July 1793 – 20 May 1864)

A British Poet.

(He was the greatest working-class  (rural ) poet that England has ever produced. No one has ever written more powerfully of Nature, of his rural childhood, and of his alienation and unstable self. Clare was committed to Lunatic Asylum in two spells  and in the second,  for 23 years at Northamptonshire County General Lunatic Asylum (now St. Andrew’s Hospital)  where he remained for the rest of his life. It’s supposed that he wrote  his most famous poem I Am there. In creativity and philosophical depths in this poem and his ‘Bird’s Nest’ poems he can be reckoned on par with Wordsworth, his contemporary )

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: