రోజు: సెప్టెంబర్ 8, 2011
-
కిటికీ పక్కన… కార్ల్ శాండ్బర్గ్
. నన్ను ఆకలితో అలమటివ్వనిండి. హాయిగా కూచుని సృష్టికి ఆదేశాలిచ్చే దేవతలారా! నాకు ఆకలీ, బాధా, లేమి అన్నీ ఇవ్వండి, కీర్తికీ, సిరులకూ నెలవైన మీ ద్వారాలను అవమాన, వైఫల్యాలతో కొట్టుకునే నాకు శాశ్వతంగా మూసివేయండి. మీరు ఎంత దుర్భరమైన దుస్సహమైన ఆకలికి నన్నుగురిచెయ్యాలనిపిస్తే, అంతగా శపించండి. ఫర్వాలేదు . కానీ, నాకు కొంచెం ప్రేమని మాత్రం మిగల్చండి … రోజు ముగియగానే నాతో సంభాషించడానికి ఒక గొంతునీ చీకటి గదిలో సుదీర్ఘమైన ఏకాంతాన్ని ఛేదిస్తూ సాదరంగా…