నిశ్శబ్దం – ఎడ్గార్ ఏలన్ పో

http://1.bp.blogspot.com/_1BZTbjlIc3M/TI-MQ1B4iKI/AAAAAAAAEuw/oev1QniUkQA/s400/802-nature-see-and-water.jpg
Image Courtesy: http://1.bp.blogspot.com

.

కొన్ని గుణాలున్నాయి- నిరాకారమైనవి,

వాటి ప్రత్యేకతని గుర్తించడానికి అనువుగా

పదార్థమూ- వెలుగూ;

ఆకారమూ-నీడా

వంటి ద్వైదీభావాలనుండి ఉత్పన్నమయేవి.

.

నిశ్శబ్దానికి  రెండంచెలున్నాయి…

సముద్రమూ- ఒడ్డూ;

శరీరమూ- ఆత్మా లా.

ఒకటి ఏకాంత మరుసీమల్లో  వసిస్తుంది…

కొత్తగా ఒత్తుగా పెరిగిన దర్భశయ్యల అంతరం లా.

రెండవది భయద గంభీర లావణ్యమైనది… 

మానవ విషాద చరితలతో,

స్మృతులతో, కలగలిసి

అది అంటే భయాన్ని హరిస్తుంది. …

అదే మృత్యువు… 

అదే అనంత నిరాకారమైన నిశ్శబ్దం. 

దానికి భయపడవద్దు.

దానికి  హాని చేయగల శక్తి లేదు.

ఒక వేళ ఒకానొక అనూహ్య (అకాల) సంఘటనవల్ల

మీరు ఆ నీడకి 

(మనిషి ఇంతవరకు అడుగిడని

ఏకాంత నిర్జన ప్రదేశాల్లో సంచరించే ఆ అనామకపు  ఛాయకి)

ఎదురుపడవలసి వస్తే,

దైవాన్ని శరణు వేడండి.
.

Silence   (A Sonnet)

There are some qualities- some incorporate things,

That have a double life, which thus is made

A type of that twin entity which springs

From matter and light, evinced in solid and shade.

There is a two-fold Silence- sea and shore-

Body and soul. One dwells in lonely places,

Newly with grass o’ergrown; some solemn graces,

Some human memories and tearful lore,

Render him terrorless: his name’s “No More.”

He is the corporate Silence: dread him not!

No power hath he of evil in himself;

But should some urgent fate (untimely lot!)

Bring thee to meet his shadow (nameless elf,

That haunteth the lone regions where hath trod

No foot of man,) commend thyself to God!

.

Edgar Allan Poe

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: