అనువాదలహరి

వర్షం పడుతుంటే… కరీనా పెరుస్సి

http://i.pbase.com/t3/15/800315/4/107758352.btvfojbj.jpg
Image Courtesy: http://i.pbase.com

.

అది  చలి వణికిస్తున్న రాత్రి…

వర్షం పడుతూంటే,

ఇంటికి ఒంటరిగా వెళ్ళేను,

బట్టలు తడిసిపోయి…

.

అంతా చిమ్మ చీకటి, 

శూన్యం…

విషాదం…

నా మాటవినే వాళ్ళెవరూ లేరు,

నిశ్శబ్దం మాత్రం రాజ్యమేలుతోంది,

నేను ఒకవేళ అరవడానికి ప్రయత్నించినా …

నేననుకుందామన్న మాటలు బయటకు రావు.

.

ప్రతి చినుకూ,

కన్నీటిలో కలిసిపోయింది,

భయం…

బాధ…

అన్ని తప్పుడువిషయాలపట్లా అసహ్యం…

అలా జారి జారి…

బొట్లు తునాతునకలయ్యాయి…

అన్ని వస్తువుల్లాగే…

అందరి మనుషుల్లాగే…

అన్ని క్షణాల్లాగే…   

.

ఏదీ శాశ్వతం కాదని ఎవరో అన్నారు…

ఒక్క మార్పు తప్ప…

బహుశా,  ఏదో ఒక బాధపడుతూండడం తప్ప…   

.

నేనో కుర్రకుంకని…

నాకు అన్నిటికీ భయమే…

నాకు ఆశ అణగారితే ఏడుపు వస్తుంది,

అన్నీ చూస్తుండగా నశిస్తే కూడా…

ప్రతీదీ, ప్రతివాడూ వెళిపోతున్నప్పుడూ…

ఒక్క జ్ఞాపకాలు మాత్రమే మిగిలి ఉంటాయి…

అవి నన్ను నాకూ… 

బయట తుఫానుకీ

వదిలేస్తూ …

.

కరీనా పెరుస్సి,

పోర్చుగీసు కవి

.

While it rains …

It’s a night so cold …
And I went home alone,
while the rain falls,
And wet my clothes …

And everything was so dark
And empty …
And sad …
And there was nobody to hear me …
The silence remained,
Even if I tried to scream …
Would not hear the words I wanted …

Every drop of rain,
Joined to a tear,
Fear …
Pain …
Hate for all the wrong things …
And after rolling, the drops broke …
Like all things,
Like all people
Like all moments …

And it said that there is nothing permanent …
Unless the change …
Or perhaps some indication of pain …

And I’m just a kid …
I’m afraid of everything,
I cry when I lose hope
and when I see that everything ends,
when everything and everyone is going …
There are only memories,
This leaves only me against myself …

And the storm outside …

Karina Perussi

Portuguese Poet

%d bloggers like this: