Hieroglyphics … Kopparthy
- Image Courtesy: https://edgecastcdn.net
Ruins of Harappa speak inaudibly…
In the revelry of Aryan assemblies
The Ganges plateau trills with great cities…
The marks of three hard feet
That walked over the Aborigine
Slipped from “Purusha Sookta” 1 are marked…
A severed thumb 2 would be located in Dandakaranya…
Only the middle path in Philosophy
Bears the foot prints of Tathagata…
Asoka stands like a stone inscription in Dhammapadam…
In the backdrop of Mahayana degenerating to Hinayana
‘Advaita’ stands peerless…
A pariah with bell hanging to his neck
Desecrates the golden era of Gupta’s…
The Emperor who gifts everything away is left
With just his clothes on, at the confluence of two rivers…
The mysticism of Sufi tradition
Binds a Muslim Emperor like a sacred thread…
The glorious facet of Prabhandas’ 3 excellence
Shall not betray the other facet of farmers
Crossing the borders of the Land of Jewels
Unable to cough up rents
And put up with the atrocities of Feudal Poligars’ ….
Everything will be in disarray…
Only one man
Questions, angers, grieves, and chastises
And walks away unclad spinning out his poems.
.
When the doors to land-ways are shut
Ships draw High Water-ways on seas…
A drizzle develops into a storm
Farmers turn to partners in agriculture,
And the partners, in turn, to farm-workers,
Never shall ships become carts 4
A Saint walks a marathon on foot to hold
A handful of sea salt in his fist…
Properties would be divided
There would be no distinction between white and black…
Old Cities and Chundur’s suffer the consequences.
.
The dialogue between the past and the present continues
No traces of the mud-houses shall remain
However,
The shadow under the lamp
Continues drawing hieroglyphics.
.
Kopparthy
.
Notes:
1 Hymns of Universal Being
2 This is the thumb of Ekalavya, a tribal, which was unjustly demanded as Gurudakshina (a respectful payment tendered to teacher by the student in appreciation of his imparting knowledge) by Drona . The irony of it was that Drona had never taught Ekalavya anything but was not ashamed to ask for it. What all Ekalavya learnt was by way of watching Drona teaching his students.
3 Prabhanda period in Telugu language is the golden era of the reign of Krishnadevaraya (1509-1529) a southern Hindu kingdom about the river Tungabhadra
4 Ships becoming carts and carts becoming ships is a Telugu idiom to indicate the vagaries of fate turning the rich to poor and the poor to rich.
.
చిత్రలిపి
.
హరప్పా శిధిలాలు వినపడీ వినపడనట్లు మాటాడతాయి
ఆర్యగణాల సామూహిక గానాల్లో
గంగామైదానాలు మహాజనపదాలుగా కువకువలాడతాయి
పురుష సూక్తం నుం చి జారిపడిన
భూమిపుత్రుడి మీద నించి
మూడుపాదాలు బలంగా నడిచివెళ్ళిన చిహ్నాలు కనిపిస్తాయి
దండకారణ్యంలో
ఒక తెగిపడ్డ బొటనవేలు దొరుకుతుంది
తత్త్వ చింతనలో
మధ్యేమార్గం ఒక్కటే తధాగతుడిపాదముద్రలు మోస్తుంది
థమ్మపథంలో అశోకుడు శిలాశాసనమై నిలుస్తాడు
మహాయానం హీనయానమైన నేపథ్యంలో
అద్వైతం అద్వితీయమౌతుంది
మెడలో గంటకట్టుకుని
పురప్రవేశం చేసిన పంచముడు
గుప్తస్వర్ణాన్ని మలినం చేస్తాడు
ఉన్నదంతాదానం చేసిన చక్రవర్తి
రెండునదుల సంగమస్థలిలో కట్టుబట్టల్తో మిగిలిపోతాడు
సూఫీ మార్మికవాదం
ముసల్మాన్ చక్రవర్తిని యజ్ఞోపవీతమై బంధిస్తుంది
పన్నులు కట్టలేక
పాళెగార్ల దాష్టీకం భరించలేక
రైతులు రత్నాలసీమ పొలిమేరలు దాటిన దృశ్యాన్ని
ప్రభంధాలు పరిఢవిల్లిన పార్శ్వం కనిపించనివ్వదు.
అంతా అపసవ్యంగానే ఉంటుంది.
ఒక్కడుమాత్రం
ప్రశ్నించి కోపించి దుఃఖించి శాసించి
పద్యాలల్లుకుంటూ దిశమొలతో సాగిపోతాడు
.
భూమార్గాల తలుపులు మూతపడిన వేళ
ఓడలు సముద్రాలమీద రహదార్లను గీస్తాయి
చిరుజల్లు తుఫానౌతుంది
రైతులు పాలికాపులై పాలికాపులు రైతుకూలీలౌతారు
కానీ ఓడలుమాత్రం బండ్లు కావు.
సెయింట్ ఒకడు నడుచుకుంటూ వెళ్ళి
పిడికెడు సముద్రస్ఫటికాల్ని గుప్పిటపడతాడు
ఆస్తి పంపకాలు జరుగుతాయి
తెలుపుకూ నలుపుకూ తేడా లేకుండా పోతుంది
పాతబస్తీలు చుండూరులు ఫలితాన్ననుభవిస్తాయి
.
గతానికీ వర్తమానానికీ మధ్య సంభాషణ నడుస్తూనే ఉంటుంది
మట్టి ఇళ్ల ఆనవాళ్ళేమీ మిగలవు
ప్రమిద కింద చీకటిమాత్రం చిత్రలిపిలో కనిపిస్తుంది.
.
22.10.1991
కొప్పర్తి
“విషాదమోహనం” కవితా సంకలనం నుండి
శ్మశాన వాటి 2….. జాషువా

.
Flourishes there on the new memorial sank in deep darkness
a lamp … like fire-fly; But strange! It is not put out spite of
running out oil! Shall we call it a lamp? No. No. No. It is
the heart of that unknown, ill-fated mother had left there.
.
ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద, బై
బొదలు మిణుంగురుంబురువు పోలిక వెల్గుచునున్న దివ్వె, ఆ
ముదముడివోయినన్ సమసిపోవుట లేదది, దీపమందు మా?
హృదయము సుమ్మి నిల్పి చనియెన్ గత పుత్రక యే యభాగ్యయో !
.
తెలుగు మూలం: మహాకవి గుర్రం జాషువా
“శ్మశానవాటి” నుండి
Hope Against Hope… Kondepudi Nirmala

.
She abhors moonshine…
And detests the drizzle…
She vents impatience
At the inability of her dwarfish hands
To reach out to Rajahmundry from Bezwada
And her vengeance over the world and
something she can’t name or express
In locking the door…
Scurrying out with a lunch box stuffed in hurry,
hanging on to the bus, to the rickshaw, to her own walk,
And to the nail-biting typewriter,
dragging the day with black carbons till night fall
With bought out sleep and endless dreaming …
And even in those fortuitous fortnightly love-plays
Remembering only the last swearing of the boss for asking for leave,
Before they could rehearse how to open up
with the none-too-assuring words,
the devil of a train blares the whistle
and they withdraw their embracing looks —
“I remain, ta-ta, take care of your health”
become routine hackneyed phraseology.
For the miracle of getting tethered to the same post happen—
they go on sending application after application
And reassuring their existence through
postal-delayed letters and with connected and disconnected calls,
with the fond hope … that, at least,
“passed away’ message
passes on to the other partner on time..
.
షరా మామూలే
……………………….
వెన్నెలంటే చీదరగా…
వానంటే చిటచిటగా …..
బెజవాడ నుంచి రాజమండ్రికి అల్లుకోలేని
మరుగుజ్జు చేతులమీద అసహనంతో ఆవిడ
లోకంమీద కసినీ, మరేదో తెలీనితనాన్నీ తలుపుకి తాళం బిగించడంలో చూపిస్తూ
కంగారు మెతుకుల డబ్బాతో
బస్సుకి వేలాడి నడకలో వేలాడి
పటపటా వేళ్ళు కొరుక్కుతింటున్న టైపుమిషనుకి వేలాడి
నల్లటి కార్బనుతో పగటిని రాత్రికి మోసికెడుతూ
కొనుక్కున్న నిద్రలతోనూ, కొలిక్కిరాని కలల కలవరింతలతోనూ
పున్నమికో అమవశకో పోగుపడ్డ ప్రేమాటలో సైతం
సెలవడిగిన వేడుకోలుకి అధికారి వాడిన ఆఖరితిట్టు గుర్తొచ్చి
భరోసాలేని కబుర్లతో గొంతెలా విప్పాలో రిహార్సలు వేసుకునేలోగా
కూత వేటు వేసిన రైలు రాకాసికి పెనగి
ఎవరి చూపులు వాళ్ళు లాక్కుంటూ
“వుంటాను టాటా ఆరోగ్యం జాగ్రత్త “గా
షరా మామూలై
ఒకే రాటకు మెడ బిగించుకునే అధ్బుతంకోసం
అర్జీల మీద అర్జీలు పెట్టుకుంటూ
పోస్టల్ డిలే ఉత్తరాలతోనూ కలిసీ కలవని టెలిఫోన్ తీగలతోనూ
బతికే వున్నామనిపించుకుంటూ
చావు వార్త చేరుతుందని నమ్ముతూ….
.
కొండేపూడి నిర్మల
12.6.90
బాధా సప్త నది – కవితా సంకలనం నుంచి
Beauteous Torture … Vimala, Telugu, Indian

.
When we reduce to
Measuring 34-24-35…
Growing pimples, losing hair,
And a size-zero waistline
Become our perpetual worries…
When our life’s sole aim becomes
Yearning for a beauteous body…
What a torture we suffer from!
.
Boring our ears and nose
We hang rings and nose-beads…
We daub and dab colors to our
Lips, fingers, eyes, and eye-brows…
We chain our neck, waist and feet
With varieties of shackles…
Pricking our body every minute
With tools of beauty
We mob the marts and malls to buy beauty…
Suspending varieties of clothing
To the body-hangers…
Applying oils
Curing it with pastes and turmeric packs,
We knead and knead our figures
Until they get parenthesized between figures…
No matter whether we smile, stroll, speak or sit
We crave for a pretentious beauty…
Cuddling, and cuddling snugly into the moulds
We believe this self-imposed torture
Is connate with us…
.
Whenever we look about ourselves
I am reminded of scare-crows of the corn fields
Stuffed with reed and grass…
Hollowed out of all that we are from ourselves
We look hollow like ‘Egyptian Mummies’…
Even if muscles were measures
For our intellect, for our love, for our responses, and
For our emotions,
And we were reduced to mere bodies…
Then,
Even our bodies are not ours in the end …
What a hideous beauty is this!
.
Where beauty is a competition
Where beauty is a commodity
Let’s hate that trading of beauty!
If beauty were inevitable for our existence,
Let’s hate that very existence!
.
Where we are white-washed,
Erected like walls to hang photos on,
Reduced to decorated ‘bulls’
And hurt with this compulsive ‘beauteous torture’
There
Pals!
Let us call for a life
Nude,
Yes, as nude as when we came out of our mother’s womb,
Sans decorations…sans any measures of beauty!
.
Let us love that lack of beauty
Of Crores of women
Who can’t buy beauty,
Can’t dab colors,
Can’t rivet themselves between figures,
But labor ceaselessly… with
Lips split, hands hardened, hair disheveled,
Eyes tired, and could only don rags!
Let us love the beauty of labor and the human values!
Let us create a wonderful beauty for one and all…
And a world
Replete with unaffected, natural beauty!
.
Vimala
.
సౌందర్యాత్మక హింస
.
మనం అంటే 34-24-35 కొలతలమైన చోట,
మొటిమలు మొలవడం, జుట్టురాలడం
నడుం సన్నగాలేకపోవడమే
మన నిరంతరాందోళనలైనచోట,
దైహిక సౌందర్య పిపాసయే
మన సమస్త జీవిత లక్ష్యాన్ని చేసినచోట,
ఎంత హింసని అనుభవిస్తున్నామో కదా!
చెవులకీ, ముక్కుకీ రంధ్రాలు పొడిచి
లోలాకులు, ముక్కెరలు వేలాడదీస్తాం.
పెదవులకూ, వేళ్ళకూ, కళ్ళకూ, కనుబొమలకూ
రంగుల్ని అద్దుకుంటాం!
మెడనూ, నడుమునూ, కాళ్ళనూ
రకరకాల గొలుసులతో బంధిస్తాం!
సౌందర్య సాధనాలతో క్షణం క్షణం
శరీరాన్ని గాయపరుచుకుంటూ
దుకాణాల్లో అందాన్ని కొనుక్కునేందుకు ఎగబడతాం.
దేహపు హేంగర్లకు రకరకాల దుస్తుల్ని తగిలించి,
నూనెలు రుద్ది, నలుగు పెట్టి, పసుపులు పూసి
దేహాలను సానబెట్టి, సానబెట్టి
అంకెల మధ్య కుదించుకుని
నవ్వినా, నడిచినా, మాట్లాడినా, కూర్చున్నా
ఒక కృత్రిమ సౌందర్యం కై వెంపర్లాడుతూ…
మూసలోకి వొదిగి, వొదిగి…
ఈ ‘స్వఛ్ఛంద’ సౌందర్య హింస మన సహజాతమని నమ్ముతూ…
.
మనల్ని చూసుకున్నపుడల్లా
గడ్డీగాదం కూరి పంటచేలో నిలబెట్టిన
దిష్టిబొమ్మ గుర్తొస్తుంది.
మమలోంచి మనల్ని తీసేసి, డొల్లచేసిన
‘ఈజిప్షియన్ ‘ మమ్మీల్లాగుంటాం!
పోనీ, మనమేధకూ, హృదయానికీ, స్పందనలకూ,
ఉద్వేగాలకూ కండరాలేకొలమానమైనా,
మనల్ని దేహాల్నే చేసినా,
చివరకు మన దేహమూ మన స్వంతం కాదు-
ఎంత వికృతమైన ‘అందం ‘ అది.
.
అందం పోటీ యైన చోట
అందం సరుకైన చోట
అందాల వ్యాపారాల్ని ద్వేషిద్దాం!
మన మనుగడకు అందం అనివార్యమైనచోట
ఈ జీవితాన్నే ద్వేషిద్దాం!
మనల్ని వెల్లవేసి, పటాల్ని తగిలించిన గోడల్ని చేసి,
మనల్ని అలంకృత గంగిరెద్దుల్ని చేసి
నిర్బంధ సౌందర్యాత్మక హింస లో
గాయపరచినచోట
మిత్రులారా!
నగ్నంగా,
అవును, నగ్నంగా, తల్లిగర్భమ్నుండి బయటపడ్డట్టు
ఏ అలంకారాలూ, ఏ సౌందర్య కొలమానాలూ లేని
జీవితాన్ని పిలుద్దాం!
.
రంగులద్దుకోలేని, అంకెలమధ్య శరీరాన్ని ఇముడ్చుకోలేని
నిరంతర శ్రమలో పెదవులు పగిలి, చేతులు కాయలు కాచి,
రేగిన జుట్టుతో, అలసిన కళ్ళతో, చింకిపాతలతో
అందాన్ని ఖరీదుచెయ్యలేని కోట్లాదిమంది స్త్రీల
అందహీనతని మనం ప్రేమిద్దాం!
శ్రమ సౌందర్యాన్నీ, మానవ విలువల్నీ ప్రేమిద్దాం!
అందరికోసం అద్భుత సౌందర్యాన్ని
సహజసౌందర్యభరిత ప్రపంచాన్నీ సృష్టిద్దాం!
.
విమల
‘అడవి ఉప్పొంగిన రాత్రి’ కవితా సంకలనం నుండి
A Silent Hymn … Vimala, Telugu, Indian

.
Ambient silence after the cremation of a corpse…
A terrible silence.
On every wood, knoll, and cottage
Even on people in the end
Settles a pall of silence.
When you look at it
You goose-bump
Recalling a pacific-looking sea.
You can’t bear such unnerving silence…
A silence where your heart beat is so audible to you!
You shoot a question
Then again,
There is silence in answer…
.
But….
There
The door panel hollowed by the tearing bullet
A plant sheared of a length of its bark…
A damp undried strain of blood on the road…
None of them may be intelligible to you, but
The sound on the lips silenced by
The din of the striped devil hovering overhead—
And the streak of sanguine in the staring eyes
Must have surely answered you.
Silence is the grief
That rolls through the eyes piercing the heart.
A silence …so inhuman.
The wounds on the branches inflicted by the metallic boots
Hurt you deeply at heart.
It’s abominable to bear the bestiality
That sucks the human blood like a blotting paper!
Stillness… is still the answer.
.
Yet….
The shouts of “Fire, Fire”
Still echo in the air across the sky
And the half-erased haphazard fleeing foot prints stay.
All these may be unintelligible to you, but
The silent fist of the Gond raised
After feeling the wet, bloodied bandage
Must have surely answered you
.
The silent currents of the sea
Are readying for a war.
It is the ominous silence of the sea
Before the waves surge into tides
The silence
Between the hand raised to beat the tom-tom
And the beat
Is
But a fraction of a second
.
Vimala
.
“నిశ్శబ్ద గీతం “
.
శవాన్ని తగలేశాక చుట్టూమిగిలిన నిశ్శబ్దం.
నిశ్శబ్దం భయంకరంగా వుంది.
ప్రతి చెట్టూ, గుట్టా, గుడిసెమీదా
ఆఖరికి మనుషులమీద కూడా
నిశ్శబ్దం కప్పబడింది.
అది చూస్తే
నీకు ప్రశాంతంగా కనపడే సముద్రం గుర్తొచ్చి
ఒళ్ళు జలదరిస్తుంది.
నీ గుండె చప్పుడు నీకే వినిపించేంత నిశ్శబ్దాన్ని,
భయపెట్టే నిశ్శబ్దాన్ని భరించలేవు!
నువ్వు ప్రశ్నిస్తావు –
మళ్ళీ నిశ్శబ్దమే జవాబు
.
కానీ……
తూటా దెబ్బ దూసుకుపోయిన తలుపు చెక్కా
బెరడు రాలిపడ్డ మొక్కా
రోడ్డుమీద ఇంకా తడి ఆరని రక్తపు మరక….
ఇవి ఏవీ నీకు అర్థం కాకున్నా,
తలమీద ఎర్రచారల రాకాసి చప్పుడుకి
నిశ్శబ్దంగా మూతపడ్డ మనిషి పెదవుల ధ్వని,
విచ్చుకున్న కళ్ళలో ఎర్రజీరా—
నీకు తప్పక జవాబు చెప్పేవుంటాయి.
గుండెల్ని చీల్చుకొచ్చి
కళ్ళల్లో సుళ్ళుతిరిగే దుఃఖం నిశ్శబ్దం.
నిశ్శబ్దం అమానుషంగా వుంది.
చెట్లకొమ్మలమీద ఇనుప బూట్లు చేసిన గాయాలు
నీ హృదయాన్ని గాయపరుస్తాయి.
మానవ రక్తాన్ని బ్లాటింగ్ పేపర్లా పీల్చే
అమానుషత్వాన్ని భరించడం అసహ్యకరం.
తిరిగి నిశ్శబ్దమే జవాబు.
.
కానీ ……..
ఈనాటికీ ఆకాశంలో,
ధ్వని తరంగాల్లో గింగురుమంటున్న
“ఫైర్, ఫైర్ ” అన్న కేకలు
అస్తవ్యస్తంగా పూర్తిగా చెరగని
పరిగెత్తిన పాదాల గుర్తులు.
ఇవి ఏవీ నీకు ఇంకా అర్థం కాకున్నా
తడిసి ఎర్రబడ్డ బ్యాండేజీ చూసుకుని
అడవిలోకి అడుగుపెడుతూ
నిశ్శబ్దంగా పైకెత్తిన గోండు పిడికిలి
నీకు తప్పక జవాబు చెప్పే వుంటుంది.
.
ప్రశాంత సముద్రంలోన అలలు
కదనానికి సన్నధ్ధం అవుతున్నాయి.
లోనుండి అలలు పైకెగిసిపడే ముందటి నిశబ్దం అది.
తుడుం మోగించడానికై
పైకెత్తిన చేతులకీ- శబ్దానికీ
మధ్యనున్న నిశ్శబ్దం
ఒక్క క్షణం మాత్రమే.
.
విమల
“అడవి ఉప్పొంగిన రాత్రి” కవితాసంకలనం నుండి
ప్రేరణ … విక్టర్ షేవ్స్, పోర్చుగీసు కవి

.
పుష్పాల స్వఛ్ఛతనీ
వెలుతురునీ ఆఘ్రాణించు
వర్షం లోని వెచ్చదనాన్ని అనుభవించు
ఆతపస్నానం చెయ్యి
గుండె నిండుగా శ్వాసించు
గాలి నిన్ను ఆరోగ్యవంతుణ్ణి చెయ్యనీ.
ప్రజల్ని పదాలతో చుంబించు
నిశ్శబ్దాన్ని ఆలకించు
గుక్కెడు చిరునవ్వుని తాగి, ఆమెకి కూడా ఇవ్వు
ఒక్క చుక్కనైనా మిగల్చకు
హావాలలో రూపించు ఆలాపనలు
నీ పాదాలతో లిఖించు
దేనికీ ఆశించకు… కానీ, అన్నిటికీ పాత్రుడవు కా
నీ ఉనికి సార్థకం చేసుకో
ప్రశ్నించకు, దానికి ఆ ఆర్హత ఉంది.
అది అస్తినాస్తి విచికిత్స
ప్రేమకై మరణించు
కనీసం, మరణించేలోగా జీవించు.
.
విక్టర్ షేవ్స్
పోర్చుగీసు కవి
.
Be inspired
Smell the light
And the clarity of the flowers
Feel the warmth of the rain
Take a sunbath
Be nourished for air and breathe in
Kiss people with words
Listen to the silence
Sip a smile and offer her
Do not miss a drop
Form songs with gestures
Write with your feet
Do not ask anything, deserve everything
Justify your existence
Do not ask, it deserves
It is, it is not
Die for love
Alive before death
.
Victor Chaves
Portuguese Poet
నేను పెద్దవుతూంటే… లాంగ్స్టన్ హ్యూజ్
.
అది చాలాకాలం కిందటి మాట.
ఇప్పుడు ఆ కలని పూర్తిగా మరిచేపోయాను.
కాని, అప్పుడు నాకో కల ఉండేది,
నా ఎదురుగానే,
సూర్యునిలా… తేజోవంతంగా—
నా కల.
కానీ తర్వాతే ఓ గోడ లేచింది
నెమ్మదిగా
నెమ్మది నెమ్మదిగా లేచింది
నాకూ నా కలకీ మధ్య.
అది ఆకాశాన్ని అంటేంతగా లేచింది
ఆ గోడ.
ఇప్పుడంతా నీడ.
నేను నల్లబడిపోయాను.
నేనిపుడు నీడలో పరున్నాను.
ఆ కల వెలుగులు, నా కంటి కెదురుగానూ లేవు,
నా మీద ప్రసరించడమూ లేదు.
కేవలం ఒక మందమైన గోడ
పక్కన ఒక నీడ. అంతే!
.
ఓ నా హస్తాల్లారా!
నిరాశామయ హస్తాల్లారా!
ఈ గోడను ఛేదించండి!
నా కలని పట్టుకొండి.
నన్నీ చీకటిని పారద్రోలనీండి.
ఈ రాత్రిని తుత్తునియలు చేసి,
ఈ నీడని
సహస్ర కిరణాలుగా,
వేలకలల కాంతి వలయాలుగా
ఆవిష్కరించనీయండి!
.
లాంగ్స్టన్ హ్యూజ్
(February 1, 1902 – May 22, 1967)
ఆఫ్రికన్-అమెరికన్ కవి, నవలాకారుడు, సామాజిక కార్యకర్త, పత్రికా రచయిత. Jazz Poetry కి ఆద్యులలో ఒకరు.
.
As I Grew Older
.
It was a long time ago.
I have almost forgotten my dream.
But it was there then,
In front of me,
Bright like a sun–
My dream.
And then the wall rose,
Rose slowly,
Slowly,
Between me and my dream.
Rose until it touched the sky–
The wall.
Shadow.
I am black.
I lie down in the shadow.
No longer the light of my dream before me,
Above me.
Only the thick wall.
Only the shadow.
My hands!
My dark hands!
Break through the wall!
Find my dream!
Help me to shatter this darkness,
To smash this night,
To break this shadow
Into a thousand lights of sun,
Into a thousand whirling dreams
Of sun!
.
Langston Hughes
(February 1, 1902 – May 22, 1967)
An African-American poet, social activist, novelist, playwright, and columnist.
సౌభ్రాతృత్వం… ఆక్టేవియో పాజ్

.
నేనొక మానవుడిని… నా ఉనికి క్షణికం…
ఈ చీకటి అపారము.
నేను తల పైకెత్తి చూస్తాను.
నాకు నక్షత్రాలు కనిపిస్తాయి.
నాకు తెలియకుండానే ఏదో అవగతమయినట్టనిపిస్తుంది:
నేను కూడా ఎవరికో కనిపిస్తున్నాను,
ఈ క్షణంలో
నన్నెవరో తలుచుకుంటున్నారు.
.
ఆక్టేవియో పాజ్
(March 31, 1914 – April 19, 1998)
మెక్సికను కవి, దౌత్యవేత్త, భారతదేశంలో 1960లలో మెక్సికో రాయబారి,
1990 సంవత్సరం సాహిత్యానికి నోబెలు బహుమతి గ్రహీత.
.
Brotherhood
.
I am a man: little do I last
and the night is enormous.
But I look up:
the stars write.
Unknowing I understand:
I too am written,
and at this very moment
someone spells me out.
.
Octavio Paz
Mexican Poet, Diplomat, Mexican Ambassador in India during 1960s and the winner of 1990 Nobel Prize for Literature.
(March 31, 1914 – April 19, 1998 )
అజ్ఞాత సమాధి … H.W. లాంగ్ ఫెలో

.
” దేశ సైనిక పటాలం నుండి విడుదలచేయబడిన సిపాయి“
………………………………………..
అని మాత్రం రాసి ఉంది ఒక సమాధి మీద
న్యూపోర్ట్ న్యూస్ సముద్రతీరపు ఉప్పునీటి కెరటాలకి సమీపంలో
పేరుగాని, తేదీగాని లేకుండా.
ఒక చిన్న పోరాటంలోనో
లేక, భీకర సంగ్రామం లోనో
తమ దుర్గం మీద జరిగిన ముట్టడిలో
శత్రుఫిరంగులు వర్షించిన గుళ్ళు
ముందువరుసలోని సాహసికులలోనుండి
దూసుకుపోయి నపుడు విధివశాత్తూ తుడిచిపెట్టుకుపోయిన
పటాలాలలోని నేలకొరిగిన గూఢచారో, పారావాడో;
కడలిపక్కన విస్మృత సమాధిలో
విశ్రమిస్తున్న అజ్ఞాత వీరుడా!
నీ సర్వస్వాన్నీ నా కోసం త్యాగం చేశావు
నీ జీవితం, నీ పేరు…
కానీ, తిరిగి నీకు నేనేమీ ఇవ్వలేనని గుర్తొచ్చినపుడల్లా
నా గుండె చెప్పుకోలేని అవమానంతో కొట్టుకుంటోంది,
నా నుదురు జ్వలిస్తోంది.
.
H.W. లాంగ్ ఫెలో (February 27, 1807 – March 24, 1882).
.
A Nameless Grave
.
‘A soldier of the Union mustered out,’
Is the inscription on an unknown grave
At Newport News, beside the salt-sea wave,
Nameless and dateless; sentinel or scout
Shot down in skirmish, or disastrous rout
Of battle, when the loud artillery drave
Its iron wedges through the ranks of brave
And doomed battalions, storming the redoubt.
Thou unknown hero sleeping by the sea
In thy forgotten grave! with secret shame
I feel my pulses beat, my forehead burn,
When I remember thou hast given for me
All that thou hadst, thy life, thy very name,
And I can give thee nothing in return.
.
H W Longfellow (February 27, 1807 – March 24, 1882).
ఓ ప్రేమా! దయచేసి నాకు నిజం చెప్పు… మికేలేంజెలో

.
“ఓ ప్రేమా! దయచేసి నాకు నిజం చెప్పు.
నేనూహిస్తున్న సత్య సౌందర్యాన్ని
నా కనులతో దర్శిస్తున్నానా?
లేక నిజంగా ఈ శిల్పాలలో
అంతర్లీనంగా ఆ సౌందర్యం ఉందా?
ఎందుకంటే, నేనెటు పరికించినా
ఆమె ముఖారవిందమే కనిపిస్తోంది.
నీకు తప్పకుండా తెలుస్తుంది…
నా ప్రశాంతతని హరించడానికీ… నన్ను దహించివెయ్యడానికీ
నువ్వామెను అనుసరించి వస్తావు గనుక…
అయినా, నేను తక్కువ బాధనాశించను…
అంతకంటే శీతల వహ్నిని కోరుకోను.”
.
“నిజంగా నువ్వు దర్శిస్తున్న సౌందర్యం ఆమెదే!
కాని, చర్మచక్షువులలోనుండి ఆత్మలోకి ఇంకిపోతూ…
అది లోతుకెళుతున్న కొద్దీ ప్రవర్థమానమౌతుంది…
అక్కడ అది తనలాగే పవిత్రమూ, మనోహరమూ అయి
దైవత్వాన్ని అమరత్వాన్ని సంతరించుకుంటుంది.
ఆ అందమే నీ కనులముందు ఆవిష్కారమౌతున్నది.”
.
మికేలేంజెలో
(6 March 1475 – 18 February 1564)
ఇటాలియన్ రినైజాన్సు కవి, శిల్పి, చిత్రకారుడు.
(16వ శతాబ్దపు అత్య్తుత్తమ కళాకారుడు మికేలేంజెలో. పాశ్చాత్య చిత్రకళలో ప్రముఖం గా పేర్కొనదగ్గ అత్యంత సుందరమైన రెండు వర్ణచిత్రాలను… రోం నగరం లోని పోప్ అధికార నివాసమైన సిస్టైన్ ఛాపెల్ లోని లోకప్పుమీద Genesis నుండి కొన్నిదృశ్యాలూ, Altar గోడపై The Last Judgement … గీసిన ప్రతిభాశాలి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తడి ఆరిపోకుండా నీటిలో కరిగేరంగులతో వర్ణచిత్రాలు గీయడమే (Fresco Painting) అక్కడి ప్రత్యేకత.)
.
Love, tell me please, if it’s with my eyes
I see that beauty’s truth, that I aspire to,
Or if it is within, since everywhere I gaze
I see that countenance of hers, sculpted.
You must know, you, who come with her,
To rob me of my peace, at which I blaze:
Though I’d not wish one sigh the less,
Nor would I demand a cooler fire.
.
‘Indeed the beauty that you see is hers,
But grows in passing to a deeper place,
Sinking through mortal eyes to the soul.
There it is made pure, lovely and divine,
Like itself as the immortal part wishes.
That is the beauty set before your eyes.’
.
Michelangelo Buonarroti (1475-1564)
( From A Translation by A. S. Kline)