ఒంటరి కోతగత్తె … వర్డ్స్ వర్త్ Image Courtesy: https://s3.amazonaws.com . చూడుడామెను, ఒక్కతె… పొలమునందు ఎదర కనిపించు ఒంటరి మిట్టవాసి, కోతకోయుచు తనుదానె పాటపాడు, నిలుడు! లేకున్న మిన్నక సాగిపొండు. ఒంటరిగ చేను కోయుచు, పనల గట్టు, ఆమె గీతిక ఆపాతవిషాదభరము, వినుడు! మార్మ్రోగె లోయ ప్రతిరవముతో. . అరబుదేశపు ఇసుక ఎడారులంట, సేదదీరెడు బాటసారుల విహారములయందు, వారి శ్రమదోవ ఇంత కమ్మని రవమ్ము, మచ్చుకొక చకోరమైన వినిపించలేదు ఇంత తియ్యని స్వరము వినిపించలేదు కోకిలలుగూడ మును వసంతాగమనవేళ, దూరతీరాల ద్వీప సమూహమందు, కడలి సాంద్ర గభీర నీరవమణచుచు. . ఎవ్వరైనను చెప్పరే పాట భావ మది గతించిన బాధల పల్లవియొకొ? యుధ్ధ గీతికొ? లేకున్న జానపదమొ? మనకు ఎరుకైన వృత్తమొ?మరల మరల కలత పెట్టెడు స్మృతి, విషాదమొ, పోగొట్టుకున్న బాధొ? . విషయమేదైన, పాటకు ముగింపు లేనియట్టుల పాడెను పడతి, నేను జూచితి కొడవలిని నూతగొనుచు పాటుబడె నామె, పాటను విడువలేదు, చెవుల చవిగొని, గుండెనిండార త్రావి కొండ నెక్కితి పాటను తోడుగొనుచు, గుండెసడిలోన అది ప్రతిధ్వనించె, గడచినది కాలమెంతయొ, పాట వినిపించి మున్ను . వర్డ్స్ వర్త్ The Solitary Reaper . Behold her, single in the field, Yon solitary Highland Lass! Reaping and singing by herself; Stop here, or gently pass! Alone she cuts, and binds the grain, And sings a melancholy strain; O listen! for the Vale profound Is overflowing with the sound. No Nightingale did ever chaunt So sweetly to reposing bands Of Travellers in some shady haunt, Among Arabian Sands: No sweeter voice was ever heard In spring-time from the Cuckoo-bird, Breaking the silence of the seas Among the farthest Hebrides. Will no one tell me what she sings? Perhaps the plaintive numbers flow For old, unhappy, far-off things, And battles long ago: Or is it some more humble lay, Familiar matter of to-day? Some natural sorrow, loss, or pain, That has been, and may be again! Whate’er the theme, the Maiden sang As if her song could have no ending; I saw her singing at her work, And o’er the sickle bending;– I listened till I had my fill; And, as I mounted up the hill, The music in my heart I bore, Long after it was heard no more. . William Wordsworth Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిఆగస్ట్ 31, 2011