అనువాదలహరి

క్షణికం … కరీన పెరుస్సి పోర్చుగీసు కవి

http://a248.e.akamai.net/7/248/3622/a088dfce97e043/www.middleeast.img.hsbc.com/public/meregional/images/en/sand_clock.jpg
Image Courtesy: http://a248.e.akamai.net

.

(మిత్రులందరికీ నా బ్లాగు ఒకసంవత్సరంపూర్తిచేసిన సందర్భంగా కృతజ్ఞతలూ, శుభాకాంక్షలూ.  ఈ ఏడాదిలో సుమారు వంద దాకా అనువాదాలు అందించగలిగాను. అయితే యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో చదువునిమిత్తం వెళ్ళి స్ప్రింగ్ సెమెష్టర్ పూర్తిచేసే వరకూ అనువాదాలురచురించలేకపోయాను. అరోగ్యకారణాలవల్ల వెనకకి తిరిగివచ్చినా, ఆ అనుభవం ఇంకా ప్రేరణనిచ్చింది. ఈ ఏడాదిలో ఎంతమందోమంచి మిత్రుల్ని సంపాదించగలిగేను.అది చాలా సంతృప్తినిస్తుంది.  ఈ ఏడాది కూడా అంతర్జాతీయ కవుల అనువాదాలు కొనసాగిస్తాననీ, ఇంతకు ముందులాగే సామాజిక బాధ్యత కొనసాగిస్తూ నా బ్లాగులో కుడిపక్క ఉంచిన Social Vibe పై క్లిక్ చేసి మీరు మీ సహకరాన్ని కొనసాగించవలసిందిగా మనవిచేస్తున్నాను. మీరు ఏవిధమైన అర్థిక సహాయమూ చెయ్యనవసరం లెదు. ఆ కంపెనీలే క్లిక్ చేసిన వారి సంఖ్యను బట్టి ఆర్థికసహాయాన్ని అందిస్తాయి. మరొక్కసారి కృతజ్ఞతలతో…. భవదీయ )

.  అశాశ్వతం

.
అది అన్నిసార్లూ వర్తిస్తుందని తెలిసుంటే,

ఎక్కువ సుఖపడిఉందును,

బాధపడుతూ కూర్చునే కంటే

ఎంతో ఆనందించి ఉందును…

ఒక కల ఇంకోలా కలగనేందుకు ఉపయోగించేదేమో

ఏదీ శాశ్వతం కాదనీ,

అన్నీ గడచిపోతాయనీ తెలిసుంటే,

నేను తక్కువ ఏడ్చి,

తగిలినవీ, తగలబోయే గాయాలగురించి పట్టించుకోకుండా,

జీవితానికి ఒదిగి ఉందును.

ఎంత మంచి ఐనా ముగియవలసిందే,

ఇక ప్రతిక్షణం అనుభవిస్తాను,

చెడుకూడా అంతే

అది ప్రపంచం లో కెల్లా భరించలేనంత కష్టం కావొచ్చు…

ఇప్పుడు నాకు అర్థం అయింది…

నా చిన్నప్పటినుండి

అన్నీ మారుతున్నవే…

ఆఖరికి నా జాడకూడా..

.

Transience

.

If I knew it would all work,

would have enjoyed more

And it would save me a dream …

I would have rejoiced more

And let me worry.

If I knew that everything would pass,

I would have cried less

And let life take me …

I would have cared less

With the wounds that would be.

What is good always ends,

And now enjoy every second …

What is bad is also,

It may be the biggest pain in the world

And then I realized:

Everything is transient

Since my birth

Even my wake.

Karina Perussi

%d bloggers like this: