వెలితి … వర్డ్స్ వర్త్ Image Courtesy: http://selcouthphantasmagoria.files.wordpress.com . ఆకస్మాత్తుగా కలిగిన ఈ సంతోషానికి ఉబ్బి తబ్బిబ్బవుతూ, గాలికన్నా కుదురు లేకుండా, ఈ ఆనందకరమయిన విషయం పంచుకుందామని పరిగెత్తుకుని వచ్చాను. ఓహ్! ఇంకెవరు? అదిగో అగాధ నీరవ సమాధిలో… ఏ మార్పుకీ చిక్కకుండా ఉన్న నీ దగ్గరకే. ప్రేమ, చెక్కుచెదరని ప్రేమ అనగానే నువ్వు మనసులో మెదుల్తావు. అసలు నిన్నెలా మరిచిపోగలనని? కానీ ఒక లిప్తలో వెయ్యోవంతుసేపు జీవితం లొ నాకు కలిగిన ఈ తట్టుకొలేని నష్టాన్ని నేను ఏమరిచేలా ఏ శక్తి పనిచేసిందో మరి? ఆ ఆలొచన మనసులో కెలకగానే, నా మనసుకి నచ్చిన అతి విలువైన సంపద… నువ్వు … ఇక లేవని తెలిసిన తర్వాత ఏ దిక్కూలేక దీనంగా నిలబడ్డప్పుడు నేనభవించినంత దుఃఖము, మళ్ళీ అనుభవించాను. వర్తమానం కాని, పుట్టని భవిష్యత్తుగాని నీ దివ్యమైన ముఖాన్ని నా కళ్లముందు నిలబెట్టలేవు గదా! . Desideria … . Surprised by joy — impatient as the Wind I turned to share the transport — O! with whom But Thee, deep buried in the silent tomb, That spot which no vicissitude can find? Love, faithful love, recall’d thee to my mind– But how could I forget thee? Through what power, Even for the least division of an hour, Have I been so beguiled as to be blind To my most grievous loss? — That thought’s return Was the worst pang that sorrow ever bore, Save one, one only, when I stood forlorn, Knowing my heart’s best treasure was no more; That neither present time, nor years unborn Could to my sight that heavenly face restore. . William Wordsworth. Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిఆగస్ట్ 26, 2011