తరచు అపవిత్రమయే మాట — షెల్లీ Image Courtesy: http://www.google.com/imgres?q=inter-stellar+space . తరచు అపవిత్రతతకు గురయే మాటని నేను మరోసారి అపవిత్రం చేస్తాను… . ఎప్పుడూ అబధ్ధమని తృణీకరించే ఒక భావనని నువ్వు మరోసారి తృణీకరిస్తావు… . నిరాశను పోలిన ఒక ఆశను, వివేకం అణచి ఉంచుతుంది … . ఎవరో చూపించే జాలికన్న, నువ్వుచూపే జాలి ఎంతో ప్రియమైనదవుతుంది … . నువ్వు అంగీకరించినా, లేకున్నా, నేనివ్వగలిగేది పురుషులు “ప్రేమ” అని పిలిచేదాన్ని కాదు… మనసును మహోన్నతం చేసేదీ, భగవంతుడుకూడా నిరాదరించలేని ఒక దివ్య ఆరాధనని . అది చుక్కలని అపేక్షించే చిమ్మట కాంక్ష లాంటిది… రేపటి వెలుగుకై రాత్రి పడే ఆరాటం వంటిది… మన విషాద వలయాలకి ఆవల ఎక్కడో దూరంగా ఉండే ఒకానొక వస్తువుకై ఆత్మార్పణ. . English original: “One word is too often profaned“ PB Shelly . One word is too often profaned For me to profane it, One feeling too falsely disdain’d For thee to disdain it. One hope is too like despair For prudence to smoother, And pity from thee more dear Than that from another. I can give not what men call love; But wilt thou accept or not The worship the heart lifts above And the Heavens reject not; The desire of the moth for the star, Of the night for the morrow, The devotion to something afar From the sphere of our sorrow? Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిఆగస్ట్ 24, 2011