అనువాదలహరి

Oh This, afterall!… Aduri Satyavathi Devi

http://t1.gstatic.com/images?q=tbn:ANd9GcR_aKcVdC2CErf9MqrrT2j_K763ZV4zFPWtQ1z7HOZmKDfruISQ
Image Courtesy: http://t1.gstatic.com

.

I fancy I know you

But before I could confirm it

The context you created changes.

While I would be debating myself

The way to comprehend you

You recede into oblivion in ringlets.

Just watching you and bewildering

I liken your receding to the flow of a river

But, it is a world hemmed between two banks.

I rejoice comparing you to the sky

Yet, it occasionally pales out

Seeming helplessly leaning over cosmic horizons.

Trying to find the shades of sea in you

I want to rest content reconciling.

Isn’t it another ferocious beauty within bounds?

You immeasurable, incomparable Time!

Magic on the move!

Momentum Unconquerable by any  force!

You are restless and not a second takes rest

In that marathon run

You don’t even throw a sly look .

Time! When I come in your speeding way

How many thousands of hands

You stretched to hug me dearly!

Drowned in how many symphonies!

We run after one another endlessly

In our play of Hide and Seek.

.

ఇదే కదా!
.

నువ్వెవరో తెలుసుననుకుంటాను

అయినా అడిగేలోపునే

నీవు కల్పించిన సందర్భం మారిపోతుంది.

అసలు నిన్నెలా తెలుసుకోవాలా

అని ఆలోచనలలో ప్రశ్నించుకుంటుండగానే

వలయాలు వలయాలుగా దాటిపోతావు.

ఊరకే నిన్ను చూస్తూ ఒకింత ఆశ్చర్యమొందుతూ

నీ గమనాన్ని ప్రవహించే నదితో పోల్చుకుంటాను.

కానీ… అది రెండుగట్ల మధ్య ప్రపంచమే

నిన్ను ఆకాశంతో పోల్చి ఆనందిస్తూ వుంటాను

కానీ… అదీ ఒకచోట బేలగా

దిగంతాలపై వాలినట్లుంటుంది

నీలో సముద్రపు పోలికల్ని తెచ్చి

సరిపోయాయని సరిపెట్టుకుందామనుకుంటాను

అదీ సరిహద్దులున్న ఉగ్ర సౌందర్యమే కదా!

కొలవలేని సరిపోలగరాని కాలమా!

కదిలే ఇంద్రజాలమా!

ఏ శక్తికీ వశమవని వేగమా!

నీకు విశ్రాంతి లేదు రవంత విరామం తెరపడదు

అదే పరుగు పరుగు కొసకంటనైనా తిరిగి చూడవు కదా

కాలమా! నీ దారంతా నేను అడ్డు వచ్చినపుడు

ఎన్నివేలచేతులతో నన్ను హత్తుకున్నావో!

ఎన్నెన్ని రంగుల రాగాలలో నను ముంచి లాలించేవో

నీ వెనుక నేను నా చుట్టూ నీవు… ఇదేకదా మన ఆట!

.
ఆదూరి సత్యవతీ దేవి

వేయి రంగుల వెలుగురాగం ” కవితా సంకలనం నుండి

%d bloggers like this: