జెండా అంటే ఏదో భూభాగం కాదు — NS మూర్తి. Courtesy: Getty Images . జెండా అంటే వర్ణమాలలోని ఏవో కొన్ని రంగుల కలగలుపుతో ప్రకృతినుండో, మనిషి తయారుచేసినవో కొన్ని చిత్రాలను అద్ది నేతల అధికార, దర్పాల ప్రదర్శనకో, అధికారుల చిత్తశుధ్ధిలేని ఉద్యోగధర్మానికో ఏడాదికోమారో, రెండుసార్లో ఎగరెయ్యడానికి తయారుచేసిన గుడ్డపీలిక కాదు. అది ఒక జాతి చైతన్య స్రవంతికీ, ఆలోచనా విధానానికి ప్రతీక ఆకాశంలో కనిపించే రెపరెపలు దాని త్యాగశీలతయొక్క ఉత్తుంగతరంగాలు. కొన్నిశతాబ్దాల బానిసత్వపు చీకటిలో కలగన్న వెలుగు స్వప్నాల సాకార స్వరూపం దాని గలగలధ్వనిలో, జాగ్రత్తగా విను, జీవితాన్ని తృణప్రాయం చేస్తూ, ఏ మరణదండననైనా చిరునవ్వుతో స్వీకరిస్తూ గొంతుబొంగురుపోయేలా దిశాంతాలు ప్రతిధ్వనించేదాకా భావితరాలకు త్యాగధనుల చేసిన వాగ్దానాలు వినిపిస్తాయి. , దానినీడలో ఉన్నది ఏదో నాలుగు సరిహద్దుల మధ్యనున్న నేల కాదు… ఆ దేశపు సర్వశక్తియుక్తులూ, జాతి జీవన సౌందర్యమూ. . ఆంగ్ల మూలం: NS Murty . A Flag Is Not A Territory . A Flag is not a chequered band of colors With a mosaic of celestial bodies Or a selection of nature’s or man’s designs and derivatives. . It is stream of conscience An ethos of a people It is the high tide of sacrifice That surges up to the skies to flutter. It is the dream that filtered through long nights of bondage. In the whirr of its flutters you listen The hoarse voices of martyrs Embracing every kind of death without demur Reverberating to the limits of cosmos Making their promises to the future. . In its shade lies the strength of a nation Not a piece of land with some connotation. Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిఆగస్ట్ 14, 2011