అనువాదలహరి

The Swan – Sikhamani

http://www.wallcoo.net/animal/swan_wallpaper/images/%5Bwallcoo_com%5D_swan_wallpapers_151972.jpg

Image Courtesy: http://www.wallcoo.net/animal/swan_wallpaper/images

.

Calendars and watches measure time

Sun measures the day,  and Moon… the night.

Trees measure forests, and

Tides… the seas.

Wings of birds measure the expanse of the sky

While pupil of the eye measures horizons.

The mercury coated glass of the thermos flask

Measures the heat within the coffee.

Sacrifices measure revolutions

Tyagayya’s … the depths of music

Breast-milk measures the sweetness of motherhood.

Tears measure both ecstasy and agony

Eyes measure the dreams while

The laughing lips… the joy.

Sensibilities measure experiences,

Experiences… the life.

Breath can measure both life and death.

.

But, there lies a principle

Eddying through them all.

If that snaps,

Separating qua milk from aqua

The swan* flies off to frontiers unknown.

.

*In the poetic parlance a Swan is supposed to have been endowed with the skill to separate milk from milk diluted with water.

Tyagayya (Tyagaraja (1767-1847) was one of the greatest composers of Carnatic Music, the classical music of South India.

.

హంస
.

కాలాన్ని

కేలండర్లు, గడియారాలూ కొలుస్తాయి

పఘటిని సూర్యుడూ

రాత్రిని చంద్రుడూ కొలుస్తుంటారు

అరణ్యాలను వృక్షాలూ

సముద్రాల్ని కెరటాలూ కొలుస్తుంటాయి

ఆకాశాన్ని ఎగిరేపక్షుల రెక్కలు

దిగంతాలను కంటిపాపలు కొలుస్తుంటాయి

ఫ్లాస్కులోని కాఫీవేడిని

పాదరసం పూయబడిన గాజు కొలుస్తుంది

త్యాగాలు విప్లవాన్ని కొలుస్తాయి

త్యాగయ్యలు సంగీతాన్ని కొలుస్తారు.

చనుబాలు అమ్మతీపినీ

కన్నీళ్ళు కష్టాలను, సుఖాలనూ కొలుస్తాయి.

కళ్ళు కలల్నీ

నవ్వేపెదవులు  ఆనందాన్నీ కొలుస్తాయి.

అనుభూతులు అనుభవాల్నీ

అనుభవాలు జీవితాల్నీ కొలుస్తాయి.

ఊపిరి జననాన్నీ మరణాన్నీ కూడా కొలుస్తుంది.

వీటన్నిటిలోనూ అంతస్సూత్రంగా ఒక సూత్రం.

ఆ సూత్రం కాస్తా తెగిపోయిందా

పాలను, నీరునూ వేరుచేసి

హంస ఎటో ఎగిరిపోతుంది.

.

శిఖామణి
“మువ్వల చేతికర్ర”  కవితా సంకలనం నుండి

%d bloggers like this: